హైదరాబాద్, మేజర్‌న్యూస్: గురుకుల ఉద్యోగ పరీక్షల కోసం మన టీవీ చేసు ్తన్న ప్రసారాలను మరో ఆరు గంటలు అదనంగా పొడిగిస్తున్నట్లు మన టీవీ సీఈఓ ఆర్.శైలేష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆద్వర్య ంలో నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్ష ఈ నెల 31వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కావునా రేపటి నుంచే అదనపు గంటల ప్రసారాన్ని ప్రారంభిం చనున్నట్లు సీఈఓ వెల్లడించారు. మన టీవీ-1, మన టీవీ-2లో ఈ నెల 12వ తేది నుంచి 30వ తేది వరకు రోజూ 10 గంటల గురుకుల్ ఉద్యోగ గైడ్ ప్రసా రాలుంటాయని తెలిపారు. మన టీవీ గత ఫిబ్రవరి 16వ తేది నుండి గురుకుల్ ఉద్యోగ గైడ్ పేరుతో గురుకుల ఉద్యోగాలకు హాజరయ్యే అభ్యర్థులకు కంటె ంట్ ను అందిస్తున్నామని, పరీక్షల సమయం దగ్గరపడటంతో మరో ఆరు గం టల ప్రసారాలను పెంచామని శైలేష్ రెడ్డి వివరించారు. ఉదయం ఆరు గంటల నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రసారాలు కొనసాగుతాయన్నారు. మద్యాహ్నం ప్రసారాల్లో 2.55 నుండి 4.55 వరకు ప్రత్యక్ష ప్రసారాలుంటాయని, అభ్యర్థులు తమ తమ సందేహాలను నివౄఎత్తి చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే సుమారు 100 గంటల ప్రసారాలను అందిచామని మరో 200 గంటల ప్రసారాలను 19 రోజుల్లో అందిస్తామని స్పష్టం చేసారు. ఈ అవకాశాన్ని గురుకుల ఉద్యోగాలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగ పర్చుకోవాలని ఆయన కోరారు.