ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు ప్రజలకు శివరాత్రి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 08:14 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎం చంద్రశేఖర్‌రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మహాశివుడిని ప్రార్థించారు. శివరాత్రి సందర్భంగా శివాలయాలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 


మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి ప్రధానమైనదని, ఈ పండుగ నాడు లక్షల మంది పరమశివుని పూజించి తమ భక్తిని చాటుకుంటారన్నారు. శివరాత్రి జాగరణ అందరిలో భక్తిని పెంపొందిస్తుందన్నారు. భక్తులు, ప్రజలందరికీ ఆ మహాదేవుని కటాక్షం కలుగాలని గవర్నర్ ఆకాంక్షించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa