తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు సమర్పిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001లో మొక్కుకున్నారు. తెలంగాణ కల సాకారం కావడంతో మొక్కు చెల్లించుకునేందుకు ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కురవికి వెళ్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా, జేసీ దామోదర్‌రెడ్డి, డీఐజీ రవివర్మ, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ భాస్కరన్, ఆర్డీవో భాస్కర్‌రావు, తహసీల్దార్ సంజీవ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతిరాథోడ్, మాలోతు కవిత, టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa