మహబూబాబాద్: మహబూబాబాద్‌లోని కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేశారు. కురవి వీరభద్రస్వామికి బంగారు మీసం సమర్పించి దర్శించుకున్న తర్వాత మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. డోర్నకల్, మరిపెడ అభివృద్ధికి రూ. కోటి చొప్పున మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు చొప్పున మంజూరు చేశారు. శివుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున మొక్కు చెల్లించుకున్నందున చాలా సంతోషంగా ఉందన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కుకు భూసేకరణ పూర్తయిందని తెలిపారు. త్వరలోనే టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాను ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. మొక్కుల విషయంలోనూ కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలు 40 ఏళ్లు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదని ఆరోపించారు. అసెంబ్లిdలో కాంగ్రెస్ సభ్యుల తీరును ఎండగడతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa