ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నైలో ఘనంగా జయలలిత జయంతి వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 02:36 PM

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ జయంతి వేడుకలు చెన్నైలో ఘనంగా నిర్వహించారు. అన్నాడీఎంకే పార్టీ ఆధ్వర్యంలో చెన్నైలోని ఓమండూర్‌ ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో రాస్త్ర ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 69లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జయ చిత్రపటానికి పార్టీ నేతలు పుష్ఫాంజలి ఘటించారు. బెంగళూరు జైలులో ఉన్న జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. గత 33 సంవత్సరాలుగా జయలలిత పుట్టినరోజును ఆమెతో కలిసి జరుపుకున్నానని.. ప్రస్తుతం ఆమె లేకుండా జరుపుకోవడం బాధగా ఉందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండి.. జయ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa