ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్‌ లీడరే మనకు శరణ్యమా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:22 AM

 కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేదెలా?


 కాంగ్రెస్‌ హైకమాండ్గలో అంతర్మథనం


 ఏపీ కాంగ్రెస్‌ దూకుడుగా వెళుతున్నా పార్టీలో     నిలవని కార్యకర్తలు?  వారిలో ఆత్మస్థైర్యం     నింపేదెలా అని అధిష్ఠానం సమాలోచనలు


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : రాష్టవ్రిభజన పాపం వెంటా డుతున్నా విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీ బలోపే తానికి ఏఐసిసి నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు ప్రజా సమస్యలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటంలో ఏపీ కాంగ్రెస్‌ నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. అయినా పార్టీలో కార్యక ర్తలు, క్షేత్రస్థాయిలోని నేతలు చెలాచెదురు కావడం, పార్టీలో కాస్తోకూస్తో కొనసాగుతున్న నేతలు సైతం పక్క దార్లు వెతుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంలో అలజడి మొదలైనట్లు సమాచారం. రాష్టవ్రిభజనకు ముందే చాలా వరకు ఖాళీ అయిన ఏపీ కాంగ్రెస్‌ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిపాలయ్యాక ఒకొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న విషయం తెలిసిందే. మున్ముం దు కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వలసలు కొనసాగవచ్చన్న సమాచారమున్న ఏఐసిసి నాయకత్వం ఇకపైవాటిని అడ్డుకోవాలని సమాలోచనలుచేస్తోంది. పార్టీ నుంచి వలసలు కొనసాగకుండా అడ్డుకట్టవేసి పార్టీలో కొనసాగేలా నేతల్లో, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ఏ చర్యలు తీసుకొంటే బాగుంటుందన్న సమాలోచనలు కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వంలో మొదలైనట్లు సమాచా రం. ఇతర పార్టీలోకి తమ పార్టీ నేతలు వెళ్లడానికి గల కారణాలలో రాష్ట విభజన ఒకటైతే పార్టీని నడిపించేం దుకు చరిష్మ ఉన్న నేత లేకపోవడం మరోకారణమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ దిశగా పార్టీ హైకమాండ్‌ నిర్ణయాలు తీసుకొంటే తిరిగి ఏపీలో పార్టీ పుంజుకొంటోం దని వారు చెబుతున్నారు. పార్టీలోని నేతల అభిప్రాయాలు తీసుకొంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏపీలో పార్టీ బలోపేతానికి ఏలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై అంతర్మథనం పడుతున్నట్లు తెలుస్తోంది.


అధికారం ఇక కలేనా?


ఒకప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలలో తిరుగులేని ఆధిప త్యంతో అధికారం చలాయించిన కాంగ్రెస్‌ పార్టీ క్రమక్ర మంగా వివిధ రాష్ట్రాలలో నేడు ఉనికిని చాటుకోలేని దుస్థి తికి చేరుకొంది. తమిళనాడు, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో కాంగ్రెస్‌పార్టీ ఈ దుస్థితిని ఎదుర్కొంటోంది. పరిమిత సీట్లకు పరిమితం అవడం తప్పా ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల వల్ల ఇక్కడ కూడా ఇక అధికారం శాశ్వతంగా దూరం అవుతామా అన్న ఆందోళన ఏఐసిసి నాయకత్వంలో నెలకొన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన సమయంలో నూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌ వెంట నిలి చారు. 2004, 2009లో కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం అధికారంలోకిరావడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అందిం చిన మెజార్టీ ఎంపీలు కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే రాష్ట్ర విభజన నిర్ణయంతో అటు తెలంగాణలో నూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీ నష్టపో యింది. మెజార్టీ ఎంపీ సీట్లు ఇతర పార్టీలు సాధించుకొ న్నాయి. దీంతో రానున్న కాలంలో విభజిత ఆంధ్రప్రదే శ్‌లో ఇక పార్టీకి పునాదులు ఏమేర ఉంటాయి అన్న ఆం దోళన కాంగ్రెస్‌ హైకమాండ్‌లో నెలకొంది. మున్ముందు ఈ రాష్ట్రంలో ఇక పార్టీకి అధికారం కలేనని ఆయా పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇదే అందోళన ఏఐసిసిలోనూ ఉందని ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


రాష్టవ్రిభజన అనంతరం సార్వత్రిక ఎన్నికలకు ముందే విభజిత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు నూతల అధ్య క్షులను కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను మార్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయన స్థానంలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని నియ మించింది. ఏపీలో మాత్రం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌. రఘువీరారెడ్డినే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇంకా కొనసాగిస్తోం ది. ఆయన పనితీరుపై సంతృప్తిగా ఉన్న ఏఐసిసి నాయక త్వం పార్టీ నుంచి నేతలు, కార్యకర్తలు చేజారడంపై ఆందో ళనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలలో ఆత్మస్థైర్యం నింపేలా నాయకత్వ మార్పుచేయాలని, పార్టీ లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలన్నదిశగా ఏఐసిసి నాయ కత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీలో ఉన్న మాస్‌లీడర్‌ కొరతను తీర్చేదిశగా కూడా ఏఐ సీసీ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa