ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓరుగల్లులో ఘనంగా శివరాత్రి వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:23 AM

  మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః చారిత్రాక ఓరుగల్లు నగరంలో మహ శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకతీయ కళా వైభవానికి ప్రతీ క ఐన వేయి స్థంబాల ఆల యంలో శివున్ని దర్శించు కునేందుకు భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి సామాన్య భక్తులకు ఐదు గంటల సమయం పట్టింది. భారీగా భక్తులు హజరయిన నేపథ్యంలో ఈ సారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. ఎమ్మెల్యే వినయ్‌బాస్కర్‌ ఆల యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.  నగరంలోని పద్మాక్షి దేవాలయం తో పాటు ఇతర దేవాలయాలలోను భక్తుల సందడి కనిపించింది. మెట్టుగుట్ట రామ లింగేశ్వరస్వామి వద్దకు ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు చేరుకు న్నారు. పాలకుర్తి సోమశ్వేర స్వామి సన్నిదికి కూడ భారీగానే భక్తులు హాజర య్యారు. మొత్తమ్మీద జిల్లాలోని శైవాలయాలన్ని శివనామస్మరణతో మోగాయి. రాత్రంతా జాగారం చేసే భక్తుల కోసం ఆయా ఆలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa