ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీ మరణానికి సంఘ్‌ కారణమా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:21 AM

ఎన్నికల గెలుపే అంతిమ లక్ష్యం కాదు. సమాజంలో మార్పు తేవడం ఉన్నతం. అమెరికన్‌ రాజకీయ వ్యాఖ్యాత పాట్‌ బుచానన్‌ మార్పు ప్రగతిశీలం, సార్వజనీనం, సమ్మిళితం, వెనుకబడిన వర్గాల, హక్కులు తెలియని, ప్రశ్నించలేని ప్రజల ప్రయోజనకారి కావాలి. కుతంత్ర ఎన్నికలు, మతరాజ్య స్థాపన, చరిత్ర వక్రీకరణ, నిజనిరాకరణ, తమ తాత్వికతను ప్రశ్నించినవారి హత్యలు సామాజిక మార్పు కాదు. గాంధీ హత్య చర్చలో ఇదే జరుగుతోంది. మహాత్ముని మరణ విశేషాలు, నిజాలు చరిత్రలో ఉన్నాయి. 


ఆరోపణ: ’గాంధీ హత్యలో సంఘ్‌ హస్తముందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. తీవ్రంగా స్పందించిన భాజపా, 48 గంటల్లో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని లేకుంటే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.’ (నవ తెలంగాణ 26.04.2017) దళితుల, మైనారిటీల, మేధావుల దుర్మార్గ హత్యలలో హస్తమున్నా వత్తిడి వచ్చేదాకా, రాజకీయ ప్రయోజనం కలిగే వరకూ ఏళ్ళ తరబడి వీరి ముఖ్య మంత్రులు, ప్రధాని స్పందించరు. నిజం మాట్లాడినందుకు 48 గంటల్లో క్షమాణ చెప్పాలి! ఉన్న మాటంటే ఉలుకెందుకు? గోద్సేలు ఒప్పుకున్న నిజమే కదా! అందుకే కదా గుజరాత్‌ లో సంఘ్‌ గోద్సే గుడి కట్టింది. విజయన్‌ తల నరికినవారికి కోటి రూ.ల బహుమతిస్తాను. గుజరాత్‌ లో 2002 లో 2 వేల మందిని స్మశానానికి పంపాం. భాజపా ఎం.పి. చింతామణి మాలవ్యా, ఎం.ఎల్‌.ఎ. మోహన్‌ యాదవ్‌ ల సమక్షంలో మధ్య ప్రదేశ్‌ సంఘ్‌ ప్రముఖ్‌ డా.కుందన్‌ చంద్రావత్‌ అన్నాడు. ప్రజాస్వామ్యంలో తమ భావాలను ప్రకటించే హక్కు ఎవరికైనా ఉంటుందని సంఘ్‌ నేతలు సమర్థించారు. చంపడమే ప్రజాస్వామ్యమా? వీరి గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ ప్రయోగశాలల్లో జరిగిందీ పశ్చిమ బంగ, త్రిపుర, కేరళలల్లో జరపాలనుకుంటున్నదీ ఇదే.


గాంధీ హత్యలో సంఘ్‌ పాత్ర: 38 ఏళ్ళ మరాఠీ యువకుడు నథురా వినాయక్‌ గోద్సే 30-01-1948 సాయత్రం 5-12 కు 3 అడుగుల దూరం నుండి బక్కపలచటి గాంధీ గుండెలో, కడుపులో 3 గుండ్లు పేల్చాడు. మహాత్ముడు మరణించాడు. 31-01-1948 నాటి ప్రపంచ పత్రికలన్నీ ప్రచురించిన వార్త. పూనాలో ప్రచురించబడే హిందూమహాసభ మరాఠీ దినపత్రిక ’హిందూ రాష్ట్ర’ సంపాదకున్నని గోద్సే చెప్పుకున్నాడు. గోద్సే హిందూ జాతీయవాద సంస్థలు సంఘ్‌, హిందూ మహాసభలలో క్రియాశీలక పాత్ర పోషించాడు. గాంధీ హత్య తర్వాత్‌ సంఘ్‌ గోద్సే సంబంధాన్ని, సభ్యత్వాన్ని వివాదించింది. సంఘవిద్రోహ శక్తులతో సబంధముంటే కలిగే సమాజ వ్యతిరేకతకు, ఎదురయ్యే చట్టపర చర్యలకు భయపడి అందరు చేసే పనే ఇది. ఓట్ల కోసం అంబేడ్కర్‌, ఫూలేలతో పాటు గాంధీ, పటేళ్ళను సంఘ్‌ సొంతం చేసుకోవడం అడ్వాణీ కాలం నుంచే మొదలయింది. అందులో భాగమే గాంధీ హంతకుల తిరస్కరణ. ఈ మోసాన్ని నథురా తమ్ముడు గోపాల్‌ తీవ్రంగా ఖండించాడు. నథురాం, దత్తాత్రేయ, నేను, గోవింద్‌ సోదరులమందరమూ సంఘ్‌ లో ఉన్నాము. మేము ఇంట్లో కాదు, సంఘ్‌ లో పెరిగాం. మాకది కుటుంబంతో సమానం. నథురాం సంఘ్‌ మేధోకార్యకర్తగానే 1944 నుండి హిందూ మహాసభ పనులు మొదలు పెట్టాడు. గాంధీ హత్య తర్వాత గోళ్వాల్కర్‌, సంఘ్‌ కష్టాల పాలయ్యారు. అందుకని నథురాం సంఘ్‌ ను వదిలేశానని చెప్పి ఉండవచ్చు. నథురాం సంఘ్‌ ను వదలలేదు. ఫ్రంట్‌ లైన్‌ ప్రతినిధి అరవింద్‌ రాజగోపాల్‌ కు గోపాల్‌ గోద్సే చెప్పారు. నథురాం ఒక విదేశీ విలేకరితో, గాంధీని చంపినందుకు నేను పశ్చాత్తాప పడట లేదన్నాడు. 15-11-1949 న అబాలా జైలులో, హత్యాప్రణాళికలో సహాయకుడు నారాయణ్‌ ఆప్టే తో పాటు, గోద్సే ను ఉరి తీశారు. గోద్సేల మాటలు, నథురాం ఉరి గాంధీ హత్యలో సంఘ్‌ పాత్రను రుజువు చేశాయి. దేశవ్యాప్తంగా సంఘ్‌ చేస్తున్న అరాచకాలను వివరించి, మహాసభ, సంఘ్‌ కలిసి కల్పించిన విషపూరిత వాతావరణం తోనే ఇంతటి భయంకర, విషాద హత్య సాధ్యపడిందని తీర్మానించి నాటి గృహ మంత్రి వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ సంఘ్‌ ను నిషేధించారు. ఈ వివరాలతో శ్యామప్రసాద్‌ ముఖర్జీకి ఉత్తరం రాశారు. గాంధీ హత్యకు వెళుతున్నప్పుడు విజయులై తిరిగిరండని ఆప్టే, గోద్సేలను సావర్కర్‌ దీవించారని, ఈరోజు గాంధీకి నూరేళ్ళు నిండాయని ఆప్టే అన్నాడని హిందూమహాసభ సభ్యుడు, గాంధీ హత్యాపథకంలో భాగస్వామి ఐన్‌ దిగంబర్‌ బడ్గె కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ రోజు ఒక శుభవార్త వినడానికి రేడియో వినండి అని ఆ శుక్రవారం సంఘ్‌ తన సభ్యులందరికీ ముందుగానే సూచించింది. గాంధీ హత్యకు ముందు ఆప్టే, గోద్సేలు హిందూమహాసభ వ్యవస్థాపకుడు, సంఘ్‌ తాత్వికుడు సావర్కర్‌ ను పలుమార్లు కలిసి, సంప్రదించి, సలహాలు తీసుకున్నారని న్యాయమూర్తి జీవన్‌ లాల్‌ కపూర్‌ నిర్ధారించారు.  


హిందూ తీవ్రవాద ఆలోచనకు గోద్సే ఆద్యుడు. దశాబ్దాల నుండి పద్దతి ప్రకారం సంఘ్‌ చేసిన మేధోవక్రీకరణ ఫలితమే గాందీ హత్య. 1934 నుడి ప్రారంభమైన గాంధీ వ్యతిరేకత 6 సార్లు గాంధీ హత్యాయత్నాలకు కారణమయిది. మీ నథురా గోద్సే బొల్తోయ్‌ (నేను నథురా గోద్సే మాట్లాడుతున్నాను) అన్న మరాఠీ నాటక, హిందూతీవ్రవాదుల జీవితాల నుడి గాంధీ హత్యకు దారితీసిన మానసిక ప్రవృత్తి ఇంకా అదృశ్య కాలేదని రుజువు చేస్తుది. ప్రజాస్వామ్య పద్దతులను ప్రగాఢంగా విశ్వసించే గాంధీ అభిప్రాయభేదాలను పరిష్కరిచుకునేదుకు గోద్సే ను చాలా సార్లు చర్చలకు ఆహ్వానించారు. రాజ్యాంగ అధికరణ్‌ 19(2) భావప్రకటన దురుపయోగాన్ని నిషేధించింది. కానీ మీ నథురా గోద్సే బోల్తోయ్‌ నాటకకర్త్‌ ప్రదీప్‌ దాల్వి, ఇతర హిందుత్వ తీవ్రవాదులు, తమతో అగీకరించని వారిపై ద్వేషాన్ని, హింసను ప్రచార చేసే, వారిని హత్యచేసే, ప్రత్యర్థిని చంపడం మతపర త్యాగమన్న మత విశ్వాసాన్ని చాటుకునే హక్కులు కావాలని వాదించారు.    


రాయలసీమలో ఒప్పంద ఖూనీలు జరిగేవి. ఒప్పించినవారికి తప్ప ఖూనీచేసేవారికి ఖూనీ ఐనవారిపై కోపముండదు. ఉత్తర భారత్‌ లో తాంబూల (సుపారీ) హత్యలు జరుగుతాయి. ఇక్కడా తాంబూలమిచ్చినవారికి తప్ప చంపేవారికి హతులపై క్రోధముండదు. వీరు వృత్తి హంతకులే. గాంధీ హత్యలో హంతకులు గాంధీకి భావజాల శత్రువులు. సంఘ్‌ వీరి మెదళ్ళలో విషం నింపింది. గాంధీ హంతకులతో సహా హిందూమహాసభ సభ్యులందరూ సంఘ్‌ కార్యకర్తే. సంఘీయులకు సంఘ్‌ రాముడు, కృష్ణుడు. సంఘ్‌ భావజాలం భగవద్గీత. కార్యకర్తలందరూ అర్జునులు. భౌతికత శూన్యమై తప్పుడు భావజాలాన్ని తలల్లో నింపుకున్నవారు ఉన్మాదులతో సమానం. గాంధీ దేశానికి నష్టమని, దేశభక్తుడు గోద్సే అర్జునుని వలె గాంధీని చంపాడని సంఘీయుల అభిప్రాయం. గాంధీని జాతిపిత అనరాదని జాతీయతకు ఆధారం హిందూమతమేనని 1961 లో సావర్కర్‌ ఉద్బోధించారు. వాహ్‌ శరణార్థ శిబిరంలో సంఘ్‌ సేవల ప్రస్తావనకు స్పందిస్తూ గాంధీ, నియంతలు హిట్లర్‌, ముసోలినీల నేతృత్వాలలో నాజీలు, ఫాసిస్టులు కూడా ఇదేపని చేశారని మరువరాదన్నారు. ఆయన సంఘ్‌ ను మతోన్మాద, నియంతృత్వ సంస్థగా వర్ణించారు. 15 ఏళ్ళుగా గోద్సే సంఘ్‌ ను వదిలాడన్న వాదనను తిప్పికొడుతున్నాను. సావర్కర్‌, గోద్సేల సంబంధాన్ని, సంఘ్‌ పట్ల గోద్సే విధేయతను నిలకడగా, నిర్భయంగా ఆధారాలతో నిరూపిస్తున్నాను. సంఘ్‌ మాధ్యమాల సభ్యులెవరూ నన్ను సవాలు చేయలేకపోయారు. అని ప్రముఖ న్యాయవాది, చరిత్రకారుడు, రచయిత ఎ.జి. నూరాని 14.10.2016 న ఒక వ్యాసం రాశారు.


నిర్ధారణ: గాంధీ ని చంపింది హిందూ జాతీయ తీవ్రవాద సంస్థలైన హిందూ మహాసభ, సంఘ్‌ ల సభ్యులేనని, మహాత్ముని మతసామరస్యాన్ని సంహిచలేని తమ ముసిం్ల వ్యతిరేక భావజాలంతో గాంధీ పై ద్వేషాన్ని పెంచుకొని ఆయనను అమానవీయంగా హతమార్చారని చరిత్ర నిరూపిస్తున్నది. సంఖ్యాధిక మతవాదుల చరిత్ర వక్రీకరణలు, మతతత్వ, అసత్య ప్రచారాలు, ఓట్ల రాజకీయాలు చక్కగా నిర్ధారితమయ్యాయి.


                - సంగిరెడ్డి హనుమంత రెడ్డి










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com