ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని వర్గాల సంక్షేమమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:35 AM

 -రాబోయే బడ్జెట్‌లో కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యత


- యాదవుల కోసం నాలుగు వేల కోట్ల నిధుల కేటాయింపు


 -ఎంబిసిలకు వేయి కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి


 -అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు


 -నలభై ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ సాధించింది ఏమి లేదు


 -దేవుళ్ల మొక్కుపై కమ్యూనిస్టుల విమర్శలు అర్థరహితం


 -కాంగ్రెస్‌ కల్చర్‌ చీప్‌ లిక్కర్‌ పంచే కల్చర్‌


 -కురవి వీరభద్రస్వామికి కోరమీసాలు సమర్పించిన సిఎం


 -మహబూబాబాద్‌లో సిఎం కెసిఆర్‌


  మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం దేశంలో ఎక్కడ లేని విదంగా 36 వేల కోట్ల రూపాయల నిధులను కెటాయించామని గుర్తు చేశారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లాలోని ఉగ్గంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కులు సమర్పించే విషయంలోను కొందరు విమర్శలు చేస్తున్నారని దుయ్య బట్టారు. వామపక్షాల నేతలు మాట్టాడే ముందు వెనుక ముందు చూసుకొని విమర్శలు చేయాలని హితవు పలి కారు. దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని సురవ రం సుధాకర్‌రెడ్డి వంటి వారు కూడ దేవుడి మొక్కులపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. అందరు బాగుండాలని చేపట్టిన యాగంపైన కూడ ఆరోపణలు చేయడం కమ్యూనిస్టు నేతలకే చెల్లిందన్నారు.  మ„హా శివరాత్రి సందర్బంగా మానుకోట జిల్లాలోని కురవి వీర ƒభద్రƒస్వామికి ఆయన తెలంగాణ మొక్కును సమర్పించు కున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే స్వామికి బంగారు కోరమీసాలు సమర్పిస్తానని కెసిఆర్‌ ఆనాడు ఉద్యమ నాయకుడిగా మొక్కుకున్నారు. రాష్ట్రం ఏరపడిన నేపథ్యంలో అందరు దేవుళ్లకు ఆయన మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం కురవి మొక్కును కూడ చెల్లించుకున్నారు. పాత వరంగల్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కురవి వీరభద్ర స్వామి ఆలయానికి ఐదు కోట్లు, మరిపెడ, కురవి మండలాల అభివృద్ది కోసం కోటి రూపాయల చొప్పున నిధులను కెటాయిస్తున్నామని తెలిపారు. డోర్నకల్‌ నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయితీలకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులను కెటాయిస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో టెక్సుటైల్‌ పార్కు కోసం స్థల సేకరణ పూర్తయిందని త్వరలోనే దీనిని ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాలకు దీటుగా వరంగల్‌ను సస్యశ్యామలం చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ రెండు పంటలకు నీరు అందుతుం దన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రగతి నిరోదకులన్న సిఎం వారికి ప్రజలు నలభై సంవత్సరాలు అధికారం అప్పగిస్తే చేసింది ఏమి లేదని ఎద్దేవా చేవారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తుంటే కాంగ్రెస్‌ నాయకులు అడ్డుపుల్లలు వేస్తున్నారన్నారు. శాసనసభలో కాంగ్రెస నాయకుల తీరును ఎండగడతా మన్నారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌, కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ కల్చర్‌ చీప్‌ లిక్కర్‌ పంచే కల్చర్‌ అంటూ ద్వజమెత్తారు. బానిస బ్రతుకులకు టి కాంగ్రెస్‌ నేతలు అలవాటు పడ్డారని ద్వజమెత్తారు. ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర టి కాంగ్రెస్‌ నేతలకుందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్రంలో ఓ ముఠా తయారయిందన్న సిఎం చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకుల దృష్టిలో ప్రజలంటే ఓట్లేనని వారి సంక్షేమం పట్టదని మండిపడ్డారు. రాబోయే రోజులలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇరవై వేల కోట్ల సంపదను సృష్టిస్తుందని సిఎం ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 10 నుండి 12 వేల కోట్లతో బిసి బడ్జెట్‌ ఉండబోతుందన్నారు.


  సంచార జాతుల కోసం వేయి కోట్లతో ఎంబిసి కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నాయిబ్రాహ్మణులకు ప్రత్యేక ఆత్మగౌరవ హోదా కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 30వేల హైజానిక్‌ సెలూన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నాలుగు వేల కోట్లతో 88 లక్షల గొఱ్రెలను యాదవులకు పంపిణీ చేస్తామన్నారు. అంతకు ముందు కురవి వీరభద్రస్వామి ఆలయంలో అర్చకులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిదిలో సిఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు సిఎంకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 63వేల రూపాయల ఖర్చుతో తయారు చేసిన కోరమీసాలను స్వామి వారికి బహూకరించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీ సులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిఎం వెంట డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి సీతారం నాయక్‌, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్‌, శంకర్‌నాయక్‌, కోరం కనుకయ్య, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్‌, కవిత, టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నవీన్‌రావు, నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa