ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:54 AM

 రాష్ట్రంలో 22 లక్షల మంది పేదలకు సొంత ఇళ్లు లేవు


 శిథిలావస్థలో చిన్న ముల్కనూరు ఇళ్లు


 భారీ అవినీతి పాల్పడ్డ గృహ నిర్మాణ శాఖ మంత్రి


 సీఎం ేకసీఆర్‌కు టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ లేఖ


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : రాష్ట్ర మంత్రి వర్గం నుంచి అవినీతి పరుడైన ఇం ద్రకరణ్‌ రెడ్డిని తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అత్యంత అవినీతిపరుడని లేఖలో పేర్కొన్నారు. సొంత ఊరిలో పేదలకు ఇళ్లు కట్టించలేని వారు రాష్టమ్రంతా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఎలా కట్టిస్తారు అని ప్రశ్నించారు. హౌసింగ్‌ జేవీ ప్రాజెక్టులో పేదల ఇళ్లను రద్దు చేసి, ఇంద్రకరణ్‌ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌ విమర్శించారు. టీటీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరులో భాగంగా ఈ నెల 20న గృహ నిర్మాణ శాఖా మంత్రి ఇం ద్రకరణ్‌ రెడ్డి నియోజకవర్గంలోని స్థానిక ప్రజలు చెప్పిన పలు విషయాల విన్న అనంతరం ఈ లేఖ రాయాల్సివచ్చిందన్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకం ఎంతగానో ఉపయోగపడిందనే విష యం మీకు తెలియంది కాదని, ఇల్లంటే అస్థిత్వం ఇల్లంటే ఆత్మగౌరవం డబ్బా ఇళ్ల స్థానంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని మీరు ఇచ్చిన హామీని నమ్మి లక్షల కుటుంబాలు మీకు అధికారాన్ని కట్టబెట్టాయని, అయితే... ఇంత వరకు మీ హామీ మాత్రం నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో 22 లక్షల మంది ఇండ్లు లేని పేదలు ఉన్నారన్న సంగతి సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందన్నారు. సెర్ఫ్‌ చేసిన సర్వే ప్రకారం 56 శాతం ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాలలో 38శాతం కుటుం బాలకు ఇండ్లు లేవని తెలిందన్నారు. మీరు దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం నాసిరకంగా ఉండటంతో అవి అప్పుడే కూలిపోతూ శిథిలావస్థకు చేరుకున్నా యని, అవినీతి,అసమర్థతతో నిండిపోయిన గృహ నిర్మాణశాఖ పనితీరుకు ఇది నిదర్శనం అని తెలిపారు. గచ్చిబౌలీ లాంటి ఖరీదైన ప్రాంతంలో పేదలు కూడా నివసించడానికి గత ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాన్ని రద్దు చేసిన మీ అవినీతి ఇంద్రకరణ్‌ రెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తు న్నానని, లేని పక్షంలో ప్రజాందోళన తప్పదని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa