ముంబయి : తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెం చిన చిత్రం ‘బాహుబలి: ది కన్క్లూజన్’. ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం రూ. 1500 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లో రూ. 1,390 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేష కుడు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. చిత్రం దేశవ్యాప్తంగా రూ. 1140 కోట్లు, విదేశాల్లో రూ. 250 కోట్లు రాబట్టినట్లు ఆయన తెలిపారు.
హిందీలో 432 కోట్లు
‘బాహుబలి: ది కన్క్లూజన్’ కేవలం హిందీ భాషలో రూ. 432.80 కోట్లు రాబ ట్టినట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గతంలో విడు దలైన బాలీవుడ్ సినిమాల రికార్డులను ‘బాహుబలి: ది కన్క్లూజన్’ చెరిపేసిన సంగతి తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి ఈ దృశ్యకావ్యాన్ని తెరకెక్కించారు. ప్రభాస్, రానా, అనుష్క కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సినీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.