ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ-గవర్నెన్స్‌లో అగ్రస్థానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 03:11 AM

ఐటీ రంగంలో దూసుకువెళుతున్న తెలంగాణ


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ఐటీ రంగంలో తెలం గాణ దూసుకుపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సోమవా రం  నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన  ఇన్ఫర్మే షన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ తొమ్మిదవ  వార్షికోత్సవ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజర యిన ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో తెలం గాణ దూసుకుపోతుందని, ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా పల్లె లకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పా రు. ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ రాష్ట్రం ముందుం దని, రాష్ట్రంలో తొలిసారిగా ఈ పంచాయతీ ప్రవేశ పెట్టామన్నారు. నగదు రహిత లావాదేవీల్లో దేశం లోనే తెలంగాణ నెంబర్‌వన్‌ అగ్రగామిగా నిలిచిం దని  వివరించారు. డిజిటల్‌ లిటరసీ పెంచేందుకు సమగ్ర విధానం తీసుకొస్తున్నామన్న కేటీఆర్‌,  దేశంలోనే టెక్నాలజీ పరంగా అతిపెద్దదైన హైదరా బాద్‌ టీహబ్‌ ద్వారా ఎంట్రపెన్యూర్స్‌ని ప్రోత్సహిస్తు న్నామని చెప్పారు. ముఖ్యమంత్రికేసీఆర్‌ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీ రామారావు తెలిపారు. స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు. టీ హబ్‌తోకలిసి  200 లకు పైగా స్టార్టప్స్‌ కంపెనీలు  పనిచేస్తున్నాయని చెప్పారు.  రాబోయే రోజుల్లో యువతకు మరిన్ని మెరుగైన అవకా శాలు కల్పించేందుకు కృషి  చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఒపెన్‌ డేటా పాలసీలో తెలంగాణ రెండో స్థానంలో ఉం దన్న ఆయన,  4 వేల కస్టమర్‌ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణాల్లోని పారిశు ద్యం, మౌలికవసతుల కల్పనపై  మున్సిపల్‌ కమిషనర్లు అధికంగా దృష్టిసారించాలని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీరామారావు సూచించారు. ప్రజలేమి గొం తెమ్మ కోర్కెలు కోరడం లేదన్న ఆయన మౌలిక వసతులు మాత్రమే కల్పించాలని కోరుతున్నారని చెప్పారు. ప్రజ లకు మౌలికవసతులు కల్పించాల్సినబాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు.  స్థూలం గా పట్టణాల మున్సిపాలీటీల పనితీరు మొరుగు పర్చేం దుకు 8 మందితో ఒక కమీటీ ఎర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కమీటీ నెల రోజుల్లో నివేధిక ఇస్తుందని మంత్రి తెలిపారు. డిసెంబర్‌ నెలలో రాష్ట్రంలోని  అన్ని పట్టణాలను ఓడియప్‌( బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా) ప్రకటించేందుకు సిద్దంగా ఉండా లని మున్సిపల్‌ కమిషనర్లను రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీరామారావు ఆదేశించారు.  నిర్దేశిత లక్ష్యాన్ని  పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు.  కొన్ని పట్ట ణాలు ఈ విషయంలో వెనకబడడం పట్ల మంత్రి  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పట్టణప్రాంతంలోని  ప్రతి ఇం టికి మరుగుదొడ్డి ఉండాలన్న మంత్రి,  ఈ లక్ష్యాన్ని జూన్‌ 15 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఓడియప్‌ పట్టణాల అంశంపై  తనకు ప్రతి రోజు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలన్నారు.  లక్ష్యం పూర్తి చేయని పట్టణాల్లోని అధికారులు లక్ష్యం పూర్తి  చేసిన మున్సిపాలీటీల అధికారుల సహకారంతో పనిచేయాలన్నారు.  అవసరం అయితే నేరుగా సిడియంఏ నుంచి  అధికారి ఒకరిని ప్రత్యేకంగా అయా పట్టణాలకు పంపాలని సిడియంఎ శ్రీదేవికి  అదేశాలు జారీ చేశారు.  లక్ష్యం మేరకు బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మార్చిన  పలువురు కమీషనర్లను మంత్రి ఈసందర్భంగా అభినందించారు. పనుల్లో వెనక బడిన వారు వార్ని  స్పూర్తిగా తీసుకుని  పని చేయాలన్నారు.  రాష్ర్టంలోని మున్సిపల్‌ కార్పోరేషన్లు, పురపాలక సంఘాల కమీషనర్లతో  మంత్రి కెటి రామారావు  సోమవారం సీడీ ఎంఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈసమా వేశంలో  పురపాలనపైన మంత్రి  మార్గనిర్ధేశనం చేశారు. ప్రతి కమీషనర్‌కు తమ పట్టణాల పట్ల పూర్తి  అవగహన  ఉండాలని, పట్టణ వనరులు, అవసరాలు, ప్రణాళిలకల పైన  పట్టు ఉన్నప్పుడే వాటి రూపురేఖలు  మారతాయని తెలిపారు. ఒక్క మున్సిపల్‌ కమీషర్‌ చురుగ్గా పనిచేస్తే పట్టణ రూపురేఖలు మారడం ఖాయమన్నారు. ప్రతి పట్ట ణంలో డంప్‌ యార్డులను అభివృద్ధి చేయాలని కేటీఆర్‌  కమీషనర్లను కోరారు. ఈ వర్ష కాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మెడిసినల్‌, సువాసనలు వెదజల్లే మెక్కలను డంప్‌ యార్డులో నాటాలన్నారు.  పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రణాళిక రూపోందించి, సిడియంఏ కార్యాల యానికి ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ప్రతిపాద నల ఆధారంగా అవసరం అయిన మేరకు నిధులు కేటా యించడం జరుగుతుం దన్నారు.ప్రతి పారిశుద్ద్య కార్మికు డికి ఖచ్చితంగా రేడియం జాకెట్లు, బూట్లు, గ్లౌసుల వంటి  రక్షణ పరికరాలువిధిగా అందజేయాలని మంత్రి అదేశాలు జారీచేశారు. మంత్రి అదేశాల మేరకు కమీషనర్లు హైదరా బాద్‌ నగరంలోని అదర్శస్మశాన వాటికలు(మహా ప్రస్థా నం), ఇతర ప్రదేశాలను సందర్శించారు. వీటిని స్పూర్తిగా తీసుకుని తమ పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి సూచించారు. పట్టణాల్లోని వీధీ దీపాలకు ఏల్‌ ఈ డీ లైట్ల బిగింపుపై సమావేశంలో మంత్రి ఆరా తీశారు. ప్రతి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయా ల్లో  ఎల్‌ఈడీ విద్యుత్‌దీపాల కౌంటర్లను ఈ నెలఖరులోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌంటర్ల నుంచి ఎల్‌ఈడీ విద్యుత్‌ దీపాలు  పౌరులు  కోనుగోలు చేసేలా చూడాల న్నారు. ప్రతి పట్టణ మునిసిపల్‌ కార్యాలయంలో ఒక సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఎర్పాటు చేయాలని,  ఈ మేరకు ప్రతిపాధలు పంపాలని కమిషనర్లను  కోరారు. పట్టణాల్లో ఎల్‌ అర్‌ యస్‌ ప్రక్రియ మరింత వేగంవంతం  చేయాలని చెప్పారు.  ఈ సమావేశంలో మంత్రితోపాటు పురపాలక కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సిడియంఏ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com