ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీఆర్‌ఏలకు శివరాత్రి కానుక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 02:53 AM

వారసత్వ వీఆర్‌ఏలకు 64.61శాతం వేతనాల పెంపు
-రూ.6500 నుంచి రూ.10,500కు పెంపు  
-అదనంగా రూ.200 తెలంగాణ ఇంక్రిమెంట్‌  
-డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు  
-పెంచిన వేతనాలు ఏప్రిల్‌ 1 నుంచి అమలు
-వీఆర్వో, డ్రైవర్‌, అటెండర్‌ ఉద్యోగాల్లో
-30 శాతం రిజర్వేషన్‌ : సీఎం కేసీఆర్‌ 


హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి: వారసత్వంగా విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారి వేతనాలు 64.61 శాతం పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ ర్‌రావు ప్రకటించారు. ప్రస్తుతం వీఆర్‌ఏలు అన్ని విధాల కలిపి రూ.6500 వేతనం పొందుతున్నారు. ఈ వేతనాన్ని రూ. 10,500లకు పెంచాలని ముఖ్యమంత్రి ఇనర్ణయించారు. దీంతో పాటు రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్‌ కూడా ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.4200 వేతనం పెరుగుతుంది. గ్రామంలోనే 24 గంటల పాటు అందు బాటులో ఉండి ప్రజలకు సేవలు చేస్తున్నందున ప్రతీ వారసత్వ వీఆర్‌ఏకు డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పెంచిన వేతనాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతీ వీఆర్‌ఏకు తమ స్వగ్రామంలోనే డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టివ్వాలని, దీనికోసం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశిఆంచారు. వీటితో పాటు వీఆర్‌ఓ, అటెండర్‌, డ్రైవర్‌ తదితర ఉద్యోగాల నియామకాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్‌ఏలకు 30శాతం ఉద్యోగాలు రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. వెట్టి తదితర పేర్లతో పిలుస్తున్న వీర్‌ఏలు అని గౌరవంగా సంబోధించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల వారసత్వంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న 19,345మందికి మేలు కలుగుతుంది. ఇక పబ్టిక్‌ సర్వీస్‌ పరీక్ష రాసి వీఆర్‌ఏఉలుగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకోసం విధివిధానాలు తయారు చేయాలని టీఎస్‌పీఎస్‌సి చైర్మన్‌ ఘంటా చక్రపాణి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్‌ను సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల పబ్లిక్‌ సర్వీస్‌కమీషన్‌ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటకికీ తక్కు వేతనంతో పనిచేస్తున్న రాస్ట్రంలోని 2,900మంది డైరెక్‌‌ట రిక్రూట్‌ వీఆర్‌ఏలకు మేలు కలుగుతుంది. మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఇప్పటికే పలుమార్లు చర్చలు పరిపిన రంఎడు కేటగిరీలకు చెందిన వీఆర్‌ఏ ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, చందూలాల్‌, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎంజీగోపాల్‌, సీసీఎల్‌ఏ కార్యదర్శి కాళి చరణ్‌తదితరులు పాల్గొన్నారు. వీఆర్‌ఏ (డైరెక్‌‌ట రిక్రూటీస్‌) సంఘం అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్‌, ప్ధధాన కార్యదర్శి అంబాల శ్రీధర్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు బాలమణి, వీఆర్‌ఏ(డిపెండెంట్‌‌స) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లన్న, కార్యదర్శి రాజయ్య, కార్మిక సంఘం నాయకులు జి.రాంబాబు,పి.నారాయణ తదితరులు సీఎంతో చర్చలు జరిపారు.
`తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ర్ట్ర అభివృద్ధిలో వీఆర్‌ఏలది శక్తివంచనలేని కృషి, గ్రామంలో 24గంటలపాటు అందుబాటులో ఉండి ప్రభుత్వం తరపున ప్రతీ కార్యక్రమంలో పాల్టొంటున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. ప్రతీ నెల 1వ తారీఖున మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికి కూడా వేతనం అందాలన్నారు. వేతనంతో పాటు వీఆర్‌ఏల గౌరవం కూడా పెరగాల్సి ఉందన్నారు. వీరిని రకరకాల పేర్లతో పిలవడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతింటున్నది. వెట్టి, మస్కూరి, కావల్‌కార్‌, కాన్‌దార్‌ తదితర పేర్లతో పిలుస్తున్నారు. ఇకపై అలా కాకుండా వీఆర్‌ఏ అని మాత్రమే పిలవాలని ఆదేశించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa