ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రా సిఎంలకు తొత్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 02:58 AM

 -కాంగ్రెస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌  
-అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం


- కురవి వీరభద్రస్వామికి కోరమీసాలు సమర్పించిన సిఎం  
-దేవుళ్ల మొక్కుపై కమ్యూనిస్టుల విమర్శలు అర్దరహితం
-తెలంగాణలో అన్ని  వర్గాల సంక్షేమమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం!  
-రాబోయే బడ్జెట్‌లో కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యత
-యాదవుల కోసం నాలుగు వేల కోట్ల నిధుల కెటాయింపు  
-ఎంబిసిలకు వేయి కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి
-కాంగ్రెస్‌ సాదించింది ఏమి లేదు  
-ఆంధ్రా సీఎంలకు సంచులు మోసిన బతుకులు  
-మహబూబాబాద్‌లో సిఎం కెసిఆర్‌


హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి:  తెలంగాణ రాష్ట్ర  అభివృద్ధిని కాంగ్రెస్‌ పార్టీ అడుగడుగునా అడ్డుకుంటు న్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే వారికి నిద్రపట్టడం లేదని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ప్రభు త్వానికి రాని అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిందని, దేశ ప్రజలు వారికి 44 సంవత్సరాలు అవకాశమిచ్చారని, అయినా కాంగ్రెస్‌ పాలకులు అభివృద్ధి చేయలేదని, ప్రజలను వారు ఓటు బ్యాంకులుగా చూశారు తప్ప వారి క్షేమం గురించి ఆలోచించలేదని విమర్శించారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీని అభివృద్ధి చేయమని ప్రజలు ఆశీర్వదించి అధికారంలో కూర్చొబెట్టారని సీఎం అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీవీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన ఆయన తన మొక్కలు చెల్లించుకున్న అనంతరం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ నివాసంలో మీడియాతో మాట్లాడారు. 44 ఏళ్లపాటు పాలించినా అభివృద్ధి పనులు చేయడానికి కాంగ్రెస్‌కు సమయం సరిపోలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు మాత్రమే అయినప్పటికీ తమ పరిపాలనపై కాంగ్రెస్‌ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము చేపడుతున్న ప్రాజెక్టులకు అడ్డుపడేందుకు ఓ ముఠాను తయారు చేసి వారితో పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారని కేసీఆర్‌ విమర్శించారు.
60 ఏండ్ల పాటు వెనకబాటుకు గురైన రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టు కడదామన్న అడుగడుగునా అడ్డుకుంటున్నారని, ఇందుకోసం ఒక బ్యాచ్‌ తయారైందని, తెలంగాణలో ఏమూలన ప్రాజెక్టు కోసం శంకుస్థాపన జరిగినా అక్కడి ప్రజలను రెచ్చగొట్టి ప్రాజెక్టును ఎలాగైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు. పర్యావరణ అనుమతుల్లేవని గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్తున్నారని, ఇంతకన్న దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని సీఎం కేసీఆర్‌ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కట్టలేదని, ప్రాజెక్టు కట్టే ముందు పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తారు. ఆలస్యం కాకూడదని, ఆ అనుమతులు వచ్చేలోపు పనులు ప్రారంభించడం తప్పా?, దీనిపై కొంత మంది కాంగ్రెస్‌ నేతలు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి ప్రాజెక్టులను ఆపుతున్నారని, ఇది ప్రజల అభివృద్ధి కోరుకునేవారు చేసే పని కాదని, అభివృద్ధి నిరోధకులే ఇలాంటి పనులు చేస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆంధ్రా పాలనలో అప్పటి సీఎంలకు సంచులు మోసిన బతుకులు అని దుయ్యబట్టారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ పార్టీ నేతల కాళ్లకింద భూమి కదులుతున్నదని సీఎం విమర్శించారు. వారి పాలనలో ఏనాడూ ప్రజల పట్ల మంచి ఆలోచనలు చేయలేదని, ఎన్నికల్లో చీప్‌ లిక్కర్లు పంచడం తప్ప ప్రజల సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీ నేతలకు పట్టదని సీఎం కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. వారు ఎన్ని అడ్డంకులు సౄఎష్టించినా తెలంగాణ అభివౄఎద్ధిని అడ్డుకోలేరన్నారు. కాంగ్రెస్‌ హయాంలో భూ నిర్వాసితులకు తక్కువ నష్టపరిహారాన్ని ఇచ్చారనీ, ఇప్పుడేమో రూ.లక్షల చొప్పున నష్టపరిహారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే నీళ్లు రావద్దు.. అభివృద్ధి జరగవద్దనే రీతీలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టేలు తీసుకురావడం ద్వారా అడ్డుపడుతున్నారన్నారు. ఓట్ల కోసం చీప్‌ లిక్కరు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
అభివృద్ధికి సహకరించండి : తాను దేవుళ్లకు కానుకలు చెల్లించే విషయంలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కమ్యూనిస్టుల మాటలకు కాలం చెల్లిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలతో వాస్తవాలను శాసనసభలో తెలియజేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులను నిలదీస్తానన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చిల్లర విమర్శల ధోరణిని మానుకుని అభివృద్ధికి సహకరించాలన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం:రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అందుకు ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నామని, ఈక్రమంలోనే సాగునీటిరంగ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని వౄఎత్తిపనుల సంక్షేమం కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నామని, ఇందుకు నిదర్శంగా రూ.4 వేల కోట్లతో 75శాతం రాయితీ ద్వారా 88 లక్షల గొర్రెలను యాదవులకు అందజేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని యాదవ సొదరులందరూ రత్నాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 45వేల 600 చెరువుల్ని మిషన్‌ కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. ఇందులో 27 వేల కోట్ల చేప పిల్లల్ని వంద శాతం రాయితీపై మత్స్యకారులకు అందించినట్టు చెప్పారు. వాటి ఫలితాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని, తద్వారా మత్స్యకారులు ఆర్థిక వృద్ధి సాధించనున్నారన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa