సిరిసిల్ల: కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మండలం సంకెపల్లి దగ్గర పొన్నం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో పొన్నం సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa