తెలంగాణ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో 17వ జాతీయ పారా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ 26 నుంచి సికింద్రా బాద్‌లోని ఆర్‌ఆర్‌సిలో ప్రారంభం కానుంది. మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన 160 మంది ఈ టోర్నమెంట్‌లో పోటీపడనున్నారు. 4 ఈవెంట్లు.. హాండ్ హాండీకాప్, లెగ్ హాండీకాప్, వీల్‌చెయిర్, డ్వార్ప్ సింగిల్, డబుల్ మ్యాచ్‌లు జరుగుతాయని అధ్యక్షుడు ఏ జీవన్‌రెడ్డి (ఎమ్మెల్యే) తెలిపారు. ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్, ఉత్తరాంచల్‌కు చెందిన మనోజ్ సర్కార్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ప్రమో ద్ (ఒరిస్సా) తెలంగాణనుంచి సంజీవ్‌తోపాటు పలువురు ప్రముఖులు తలపడు తున్నారు. కాగా తెలంగాణ నుంచి 14 మంది జట్టు పోటీలో ఉన్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa