మెడ నల్లగా మారడానికి చాలా కారణాలుంటాయి. క్లీన్ చేయకపోవడం, స్క్రబ్ చేయకపోవడం, ఆత్రంతా స్నానం చేయడం వల్ల మెడ శుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల.. అక్కడ డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతాయి. దీనివల్ల అది నల్లగా మారుతుంది. ఇలాంటి డార్క్ నెక్ని తెల్లగా, మెరిసేలా మార్చుకోవాలని మీరు భావిస్తే.. కొన్ని హోంమేడ్ ప్యాక్ ట్రై చేయండి. కేవలం వారం రోజుల్లో మీ మెడ నలుపుదనాన్ని పోగొట్టుకోవచ్చు.
హోమ్మేడ్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా వారం రోజులు వేసుకోవాలి. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు 2 టీ స్పూన్లు బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ మీ నెక్
వారం రోజుల్లో తెల్లగా మారాలంటే :ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయాలి. ఆలివ్ ఆయిల్, ఉప్పు, బేకింగ్ సోడా అన్ని చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అలాగే చర్మ సంరక్షణపై శ్రద్ధ వహించాలి. ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. ఉప్పు న్యాచురల్ స్కిన్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని బయటకు పంపి.. చర్మాన్ని స్మూత్‌గా మార్చేస్తుంది. బేకింగ్ సోడా న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ప్యాక్ తయారు చేసే విధానం: పైన చెప్పిన పదార్థాలన్నింటినీ.. ఒక గిన్నెలో మిక్స్ చేసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి.. పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మెడకు పట్టించాలి. కొన్ని నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.