ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరింటాకులో దాగిన ఆరోగ్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 17, 2017, 01:53 AM

గోరింటాకును ఇష్టపడని మహిళలంటూ ఉండరు. పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే..? ఆషాడంలో ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోవాల్సిందే. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 


 ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఆధ్యాత్మికపరంగా గోరిం టాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవ డం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.


అలంకరణకు:


గోరింటాకును గురించి తెలియని మహిళలే ఉండరు. స్ర్తీల అలంకరణ సాధనాల్లో గోరింటాకు ఒకటి. గోరింటాకు ఎన్నో ఔషధగుణాలను కలిగిందని మన పూర్వీకులు దాన్ని అలంకరణకు ఉపయోగిస్తూవచ్చారు. కొందరు వారి ఇంటి పెరటిలో ఈ చెట్లను పెంచుకుంటారు. పెళ్లికూతుర్ని అలంకరిం చేందుకు, పండుగ సమయంలో భారతీ యులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ఎవరూ ఎక్కువగా గోరింటాకును ఉపయోగించట్లేదు. రెడీ మెడ్‌గా చేసిన మెహందీనే అందరూ వాడుతున్నారు.


మానసిక ఒత్తిడి మటుమాయం:


గోరింటపువ్వు, ఆకులు, వేర్లు, విత్తనాలు, బెరడు అన్నీ ఔషధగుణాలను కలిగింది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. గోరింటాకులోని ఔషధ ఫలితాలను పలు అంతర్జాతీయ నిపుణులు పరిశోధనలతో కనిపెట్టారు. అయితే కొన్ని సంవత్సరాలకు మునుపే ఆయుర్వేద పరంగా గోరింటాకుని ఉపయోగించి రోగా లను నయం చేశారు. డాక్టర్‌ ఎమర్సన్‌ మెహందీ ఆయిల్‌ శరీరానికి పూసినట్లైతే చర్మంపై ఏర్పడే మంటను తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందని కనిపెట్టారు.


డాక్టర్‌ ఎయిన్‌సిలిక్‌ గోరింటాకు పువ్వులు కుష్టు వ్యాధిని, చర్మ వ్యాధిని నయం చేయవచ్చని కనిపెట్టారు. పైత్యానికి సంబంధించిన వ్యాధిని తగ్గించే గుణం గోరింటాకులో ఉందని డాక్టర్‌ హెన్రీ పేకర్‌ తెలిపారు.


కాళ్ళు, చేతుల దురద: 


చేతులు, కాళ్ళు మంటలను తగ్గించేందుకు గోరింటాకులో బాగా నీళ్లు పోసి నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లు, పాదాలవరకు రుద్దితే మంటలు వెంటనే తగ్గిపోతుంది.


గోరుచుట్టు: 


మన పూర్వీకులు గోళ్ల చుట్టూ గోరింటాకు నూరి పెట్టుకుంటారు. దీని మూలంగా గోళ్లు అందంగా మారుతాయి. అయితే ప్రస్తుత కాలంలో నెయిల్‌ పాలిష్‌ అనే పేరులో పలు రకాలు వచ్చాయి. వీటిలో రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఔషద ఫలితాలు ఏమి లేదు. అయితే గోరింటాకు ఎక్కువ ఔషద గుణాలను కలిగిఉంది. గోళ్లలో ఏర్పడే పుండ్లు, పుచ్చులు లాంటిని గోరింటాకు నయం చేస్తుంది. లైంగిక వ్యాధుల బారిన పడిన వారు గోరింటాకు ఆరు గ్రాములు, వెల్లుల్లి ఒకటి, మిరియాలు ఐదు కలిపి దంచి తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయాన్నె తిన్నట్లైతే లైంగిక వ్యాధులు తగ్గుతాయట. ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గువగా తిన్నాలి. ఎక్కువ కారం, చింతపండు, తినకూడదు. గోరింటాకుని నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నె ఉడికించి కషాయంగా చేసి బెణికిన చోట, చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డ భాగంలో ఒత్తడం చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.


మంచి నిద్ర కోసం: 


గోరింటాకు పువ్వులను తల క్రింద పెట్టి నిద్రపోయినట్లైతే గాఢనిద్ర వస్తుంది. ఇంకా మెదడులో ఏర్పడిన వేడిని తగ్గించి శరీరానికి, మనసుకి ఉత్సా హాన్ని కలిగిస్తుంది. గోరింటారు వేరు, బెరడుని నూరి పాలులో కలిపి తాగే అలవాటు చేసుకుంటే అధిక రక్తసవ్రం నయం అవుతుంది. పైత్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని క్రమరీతిలో ఉంచేందుకు కూడా గోరింటాకు సహాయపడుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com