హ్యాపీడేస్ ఫేం రాహూల్ హీరోగా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం వెంకటాపురం. ఈ సినిమా అనూహ్యమైన రీతిలో సక్సెస్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం చాలా ఆనందంగా ఉందని, నా క్యారెక్టర్‌కు చాలా మంచి గుర్తింపునిస్తుందని చిత్ర కథానాయకుడు రాహుల్ మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు.. ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది. విడుదలైన మొదటి షో నుండి ఇప్పటి వరకు చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు మార్నింగ్ షో తరువాత కేవలం మౌతౌటాక్ వల్ల ఆడియన్స్‌లో సినిమా చూడాలన్నా ఆసక్తి పెరిగింది. మ్యాట్నీ షో నుంచి డబుల్ ఆక్యుపెన్సీతో తొలి రోజు నుంచే మంచి వసూళ్ళు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా రెండుగంటల పాటు సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది వెంకటాపురం. దానికి కారణం దర్శకుడు వేణు తీర్చిదిద్దిన కథే కారణం.