ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డ పొన్నం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 12:54 AM

  మేజర్‌న్యూస్‌- కరీంనగర్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడకు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న  టిపిసిసి ఉపాధ్యక్షులు, మాజి ఎంపి పొన్నం ప్రభాకర్‌ వాహనం నాంపల్లి గుట్టవద్ద మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంనుండి స్వల్ప గాయాలతో పొన్నం ప్రభాకర్‌ బయటపడ్డారు. అతనితోపాటు మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, కరీంనగర్‌ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్‌లతోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయినాయి. ఉదయం 4గంటలకు వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడడంతో స్థానికులు హుటాహుటినా కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏలాంటి ప్రమాదం లేదని తేల్చడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. పొన్నంకు పరామర్శల వెల్లువ  రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిపిసిసి ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌కు పార్టీలకతీతంగా జిల్లావ్యాప్తంగా ఉన్న నాయకులు పరామర్శించడంతో ఆసుపత్రి ఆవరణ కిక్కిరిసిపోయింది. బిజేపి రాష్ర్ట అధికార ప్రతినిధి బండి సంజయ్‌, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఈడిసి చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, టిపిసిసి ఎస్సీసెల్‌ చైర్మన్‌ ఆరెపెల్లి మోహన్‌, మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ వెంకటేశ్వర్లు, అల్గీరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కోడూరి సత్యనారాయణగౌడ్‌, టిపిసిసి అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, టిపిసిసి ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మినరసింహరావు, రామగుండం మేయర్‌ కొంకటి లక్ష్మినారాయణ, కరీంనగర్‌ మాజీ మేయర్‌ డి. శంకర్‌, అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డితోపాటు పెద్ద ఎత్తున నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరామర్శించేందుకు తరలి వచ్చారు. దేవుడి దయతో బతికి బయట పడ్డా  పరామర్శించడానికి వచ్చినవారితో పొన్నం మాట్లాడుతూ జిల్లా ప్రజల అభిమానం ఉండడంతోనే దేవుడు నాపై  ఉంచిన దయతో ప్రమాదంనుండి బయటపడ్డానని తెలిపారు.నాతోపాటు ప్రయాణిస్తున్న వారికి కూడ స్వల్ప గాయాలు కావడం పూర్వ జన్మ సుకృతమన్నారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa