-సిఎం కెసిఆర్ ను హెచ్చరించిన మాజీమంత్రి డిెక ఆరుణ
-ఎన్నికల మానిఫేస్టో ఏమైంది
-ముస్లింల రిజర్వేషన్లు ఏవీ ?
-ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్గరూంలు ఎక్కడ ?
-రాజకీయాలు చేస్తున్నది కెసిఆర్
-దొంగల ముఠా కెసిఆర్ కుటుంబమే
జోగులాంబ గద్వాల, మేజర్‌న్యూస్ : 2019 ఎన్నికలలో ఓటమి పాలవుతాననే భయంతొనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ పార్టీని టార్కెట్ చేసి చిల్లర ఆరొపణలు చేస్తు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిదంగా వ్యవహరిస్తున్నాడని మాజి మంత్రి, పిసిసి ఉపాద్యక్షురాలు , గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ సిఎం కేసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసిఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను ముఖ్యమంత్రి తక్షణం ఉపసంహకరించుకోవాలని లేనిపక్షంలో తీవ్రమైన పరిణాములుంటాయని హెచ్చరించారు. కేసిఆర్ కుటుంబమే దొంగల ముఠాగా ఏర్పడి దొరికిన కాడికి దొచుకుంటున్నట్లు ఆరోపించారు. ముస్లింలకు గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలన్నారు. దళితుడుని ముఖ్యమంత్రి చేస్తానని, 3 ఎకరాల భూపంపిణీ చేస్తానని చెప్పిన కేసిఆర్ తన మాట నిలబెట్టుకొలేదన్నారు. డబుల్ బెడ్‌రూం, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చె ప్పి ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. అధికారంలోకి వచ్చి దళితులకు మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకున్న సిఎం అదే పద్దతిలో మాట్లాడుతూ ప్రజలను దుయ్యబడుతున్నారని చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల మోచేతి నీరు తాగుతున్న కేసిఆర్ కాంగ్రెస్ వారిని తిట్టే పద్ధ్దతి మానుకోవాలన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వకుంటే చెప్రాసి ఉద్యోగం కూడా రాదన్నారు. తెలంగాణలో ఎంతమంది తెలంగాణ వారు పనిచేస్తున్నారో చెప్పాలని, ఉద్యమకారులను పక్కన పెట్టారని అన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన సభ్యులకు ఎవరికైనా రాజకీయ పదవులు ఇచ్చాడా అని ప్రశ్నించారు. రాజకీయ పదవులకు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారుల కుటుంబసభ్యులు అర్హులు కారా అని ప్రశ్నించారు. ఎంతోమంది విద్యార్థులు రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేశారని ఎందుకు వారి కుటుంబాలకు పదవులు ఇవ్వలేదన్నారు. మొక్కులు తీర్చుకొవడంలో స్వంత డబ్బులతో మొక్కులు తీర్చుకోవాలని ప్రజాధనంతో మొక్కులు తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో దేవాలయాలకు నిధులు ఇవ్వకుండా తాను ముఖ్యమంత్రి అయితే మొక్కు తీర్చుకుంటానని ప్రజా ధనంతో తీర్చుకోవడం హేయమైన చర్య అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో దొడ్డిదారిన గెలిచేందుకు ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సభలు, సమావేశాలకు రావాలని అల్లుడు బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఒల్లు, కళ్లు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో తెలంగాణలో తిరగలేవని ఆమె హెచ్చరించారు. తెలంగాణ ఇవ్వకుంటే చెప్రాసి ఉద్యోగానికి కూడా అర్హుడవు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంవస్తే నిధులు, నీళ్లు, నియామకాలన్నీ తెలంగాణకే వస్తాయని చెప్పిన కేసిఆర్ కాంట్రాక్టు పనులు ఆంధ్ర వారికిచ్చి కమీషన్లు దండుకుంటున్నాడని ఆరోపించారు. వారికే కాంట్రాక్టులు కట్టపెట్టి తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. బాధ్యతైన పదవిలో ఉన్న కేసిఆర్ కారుకూతలు కూస్తూ రాష్ట్రానికే చెడ్డపేరు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ నాయకులే చీప్ లిక్కర్ నేతలుగా ఆమె అభివర్ణించారు. సెంటిమెంట్‌తో 14 సంవత్సరాలు పబ్బం గడుపుకున్న కేసిఆర్ తాజాగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా అదే సెంటిమెంట్‌తో ఉండి ప్రజలను మోసం చేస్తున్నాడని పాంహౌజ్‌లో ఉంటూ ఉత్తర ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. నీచరాజకీయాలు చేస్తున్న నీవు భవిష్యత్తులో తెలంగాణలో పర్యటించలేవని ఆమె నిలదీశారు. ఎసి గదులలో సమావేశాలు చేస్తూ ప్రజలను తప్పుదొవపట్టిస్తున్నాడన్నారు. ఆయనకు నిజాయితీ ఉంటే నియోజకవర్గాలలో పర్యటించి పరిపాలన సాగించాలన్నారు.
తెలంగాణలో పిచ్చితుగ్లక్ పరిపాలన కొనసాగుతుందని ఈ పిచ్చితుగ్లక్ పీడను తొలగించుకునేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. విలేకర్ల సమావేశంలో గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, పటేల్ ప్రభాకర్‌రెఢ్డి, బంగి సుదర్శన్, నాగేంద్రయాదవ్, భాస్కర్ యాదవ్, నర్సింహులు, రమేశ్, పూజారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa