-మార్చి 17 బదులు 20కి మార్పు
-రెండు రాష్ట్రాలకు వర్తింపు
-ఓట్ల లెక్కింపు కూడా 20నే
-28న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫిేకషన్
-7 వరకూ నామినేషన్లు ఉపసంహరణకు ముగింపు 10
హైదరాబాద్ , సూర్య ప్రధాన ప్రతినిధి : ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోలిం గ్‌కు సంబంధించి స్వల్ప మార్పు చోటు చేసుకున్నది. మార్చి 17న జరగాల్సిన పోలింగ్‌ను అదే నెల 20వ తేదీకి నిర్వహిం చనున్నారు. మారిన షెడ్యూల్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వర్తించనుంది. ఓట్ల లెక్కిపు కూడా మార్చి 20నే జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఫిబ్రవరి 28న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 7 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 8న పరిశీలన, 10న ఉపసంహరణ చేపట్టనున్నారు. మార్చి 17న జరగాల్సిన పోలింగ్‌ను 20కి వాయిదా వేశారు. తొలుత ఎమ్మెల్యే ల కోటా, ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 17న నిర్వహించాలని నోటిఫికేషన్ జారీచేసినప్పటికీ తాజాగా ఆ షెడ్యూల్‌ను మారుస్తున్నట్టు తెలిపింది. ఈ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వర్తిం చనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa