ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం ఆశలకనుగుణంగా పనులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:10 AM

హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధిః తెలంగాణలోని ప్రతి పల్లెలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే ందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పనులను సీఎం ఆశలకనుగుణంగా చేపట్టాలని గ్రామీణ తాగునీటి విభాగం ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ బి.సురేందర్‌రెడ్డి కోరారు. రెండేళ్లలోనే ప్రతి ఇంటికి తాగునీటిని అందించి దేశ, విదేశాలను ఆకర్శింపచేసే భగీరథ పనుల్లో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. రెండేళ్లలోనే సీఎం భగీరథ యత్నాన్ని పూర్తి చేయాలన్నారు. ఇందుకు అనుగుణంగా పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని, గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శనివారంనాడు మిషన్‌ భగీరథలో భాగంగా గోదావరి-మంగపేటసెగ్మెంట్‌ పనులను ఈ.ఎన్‌.సిపరిశీలించారు. ముందుగా జయశంకర్‌భూపాలపల్లిజిలా ్లజాకారం దగ్గర కడుతున్న  పనులను పరివీలించారు. ఆతర్వాత తాడ్వాయి, ఏటూరు నాగారం అటవీప్రాంతంలో పైపులైన్ల పనులను పరిశీలించారు. భగీరథపనులకు కావాల్సిన అనుమతుల విషయంలో ఫారెస్ట్డిపార్టుమెంటు సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. భగీరథ యాక్షన్‌ ప్లాన్‌కు అనుగుణంగా ఫారెస్టు అనుమతులు వస్తున్నాయని తెలిపారు.  ఆతర్వాత కంతనపల్లితోపాటు రొయ్యూరు 12  హెడ్వర్క్‌లనుపరిశీలించారు. అక్కడి నుంచి కొత్తగూడెం జిల్లాపూసూరు ఇన్‌టేక్‌వెల్‌తో పాటు 9  మెడ్‌వర్కు పనులను పరిశీలించారు. పూసూరు-ముళ్ళకట ్టబ్రిడ్జిపై నుంచి వేసే పైపులైన్లపనులలో ఇంజినీర్లకు ఇఎన్‌సీ పలు సూచనలుచేశారు.మంగపేట-గోదావరిసెగ్మెంట్లోభగీరథపనులు సంతృప్తి క్తకరంగాసాగుతున్నాయన్నఈ.ఎన్‌.సి తెలిపారు. టార్గెట్‌లోగా అన్ని ఆవాసాలకు మంచినీళ్ళుఇవ్వాలన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఈవేసవిి ఎక్కడా తాగునీటికొరతరావొద్దని, అందుకు తగ్గట్టుగా నీటిసరఫరా ేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఏజెన్సీఏరియాల్లోతాగునీటికొరతఏర్పడి తేసంబంధి తఅధికారులపైకఠినచర్యలుతీసుకుంటాననిహెచ్చరించారు. త్వరలోనే మరోసారివస్తానన్నఈ.ఎన్‌.సి, భగీరథ పనులు మరింత వేగంగాచేయాలని వర్క్‌ఏజెన్సీలను ఆదేశించారు. సాయంత్రం జనగామ జిల్లాకలెక్టర్‌ దేవసేనతో కలిసిఆసెగ్మెంట్‌పనులపైసమగ్రంగాసమీక్షించారు.
ఈపర్యటనలో సీఇ సురేష్‌ఖుమార్‌,  వరంగల్‌ ఎస్‌ఇలు యేసురత్నం, రామచంద్రనాయక్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa