హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి: అమెరికాలో కాల్పుల ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మైనింగ్, మున్సిపల్‌శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు విచారం వ్యక్తం చేశారు. గత నెలలో వంశీ, ఇప్పుడు శ్రీనివాస్, అలోక్‌రెడ్డిపై దాడి జరిగింది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా విదేశీ వ్యవహా రాల శాఖతో మాట్లాడుతామని తెలిపారు. అమెరికాలో హత్యకు గురైన కూచిబోట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్ కూచిభొట్ల హత్యతో తాను షాక్‌కు గురయ్యానని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. అమెరికాలో గత నెలలో వంశీ, ఇప్పుడు శ్రీనివాస్ హత్యకు గురికావడం బాధాకరంగా ఉందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి విదేశాంగశాఖతో మాట్లాడ తానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మంత్రుల పరామర్శించారు. అమెరికాలో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను రాష్ట్ర మం త్రులు, ఎంపీలు శనివారం పరామర్శించారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్, మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు మైనంపల్లి హనుమంతారావు తదితరులు వారి ఇంటికి చేరుకుని పరామర్శించారు. శ్రీనివాస్‌తోపాటు అతని స్నేహి తుడు అలోక్ మాడసానిపై ప్యూరింటన్ అనే 51 ఏండ్ల శ్వేతజాతీ యుడు ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్ వద్ద కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో శ్రీనివాస్ చనిపోగా, గాయాలపాలైన అలోక్ హాస్పిటల్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదే ఘటనలో వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిల్లోట్ హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఇది విషాదకరమైన, మతిలేని హింస అని ఒలేథ పోలీస్ చీఫ్ స్టీవెన్ మెన్కే విలేకరులకు చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దురుద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా తాజా ఘట నను హిందూ అమెరికన్ ఫౌండేషన్ అభివర్ణించింది. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయులు తీవ్ర దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa