ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా ఎన్నికల ఫలితాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:38 AM

-మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం  
-పాక్‌కు ప్రయోజనం కలిగేలా చిదంబరం వ్యాఖ్యలు  
-కాంగ్రెస్‌లో వారసత్వంతోనే పదవులు  
-బీజేపీలో కష్టపడ్డవారిేక పదవులు  
-తెలుగు రాష్ట్రాల్లో బలమైన శక్తిగా బీజేపీ  
-తెలుగు రాష్ట్రాలకు ఒరిస్సా ప్రేరణ కావాలి
-తెలంగాణలో గెలిచి సంబరాలు జరుపుకోవాలి  
-బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభలో కంద్ర మంత్రి వెంకయ్య నాయుడు


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః  మహారాష్టల్రో నోట్ల రద్దు అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారని అది ప్రజలకు మోదీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అధికారం కాంగ్రెస్‌ వారసత్వ హక్కుగా భావిస్తోందని, బీజేపీలో కష్టపడి పనిచేసే వాళ్లకే పదవులు వస్తాయన్నారు. కాంగ్రెస్‌లో వారసత్వం ద్వారానే పదవులు, అధికారం లభిస్తాయన్నారు. పాక్‌కు ప్రయోజనం కలిగేలా చిదబంరం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించనందుకు తెలంగాణ బీజేపీ నేతలు శనివారం పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన శక్తిగా మారుతుందన్నారు. ఎక్కడో గెలిస్తే సంబరాలు కాదని, ఇక్కడ కూడా పార్టీ బలపడాలన్నారు. ప్రజల్లోకి వెళ్లి కష్టపడితే ఫలితం ఉంటుందని, పోరాటానికి సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వ పథకాలే కార్యకర్తలకు ఆయుధాలని పార్టీ సిద్దాంతాలపై రాజీపడొద్దన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఒరిస్సా ప్రేరణ కావాలని సూచించారు. పరిపాలన కాంగ్రెస్‌కు జన్మ హక్కుగా భావిస్తున్నారని, చిదంబరం అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దేశ ఐకమత్యానికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ముస్లింలు మా పార్టీకి ప్రత్యర్థులు కాదని, పాత బస్తీలో ప్రజలకు ఏమీ చేయని మజ్లీస్‌ పార్టీ తమకు ప్రత్యర్థి అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.  ఓవైసీల పాలనలో పాతబస్తీలోని ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా, మజ్లిస్‌ను పెంచి పోషించింది కాంగ్రెస్‌ కాదా, కాంగ్రెస్‌కు మజ్లిస్‌కు పొత్తు లేదా, కేసీఆర్‌ నోట్ల రద్దును స్వాగతిస్తే తప్పా అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. నోట్ల బదిలీపై బీజేపీ అనుకున్నంత ప్రచారం చేయలేకపోయామని వెంకయ్య నాయుడు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారాలని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని  లక్ష్మణ్‌ సూచించారు. మోదీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  తెలంగాణలో కూడా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, బీజేపీ ప్రస్తుతం ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కూడా మెజార్టీతో అధికారంలోకి వస్తుందని మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. భారత దేశ రాజకీయాల్లో గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయని, అన్ని పార్టీలు బీజేపీని లక్ష్యంగా పెట్టుకొని విమర్శిస్తున్నాయని, బీజేపీ వైపు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు విజయోత్సవ సభలో పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa