ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాత కే సి శేఖర్‌ బాబు మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:57 AM

మెగాస్టార్‌ చిరంజీవి తో ముఠా మేస్ర్తి వంటి హిట్‌ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కే సి శేఖర్‌ బాబు ఈరోజు ఉదయం గుండెపోటు తో మరణించాడు. 73 ఏళ్ళ కే సి శేఖర్‌ బాబు గోపాలరావు గారి అమ్మాయి, మమత, సంసార బంధం, సర్దార్‌, చిలకమ్మా, ముఠా మేస్ర్తి తదితర చిత్రాలను నిర్మించాడు. ఫిలిం ఛాంబర్‌ లో అలాగే, నిర్మాతల మండలి లో పలు హోదాల్లో పనిచేసిన కే సి శేఖర్‌ బాబు ఈ తెల్లవారు ఝామున 4. 30 నిమిషాలకు గుండెపోటు తో మరణించారు. హైదరాబాద్‌ లోని జర్నలిస్ట్‌ కాలనీ లో పరమపదించారు శేఖర్‌ బాబు. శేఖర్‌ బాబు మరణం తో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యింది. పలువురు దర్శక నిర్మాతలు, నటీనటులు శేఖర్‌ బాబు అకాల మౄతి కి తీవ్ర సంతాపాన్ని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa