ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరిసిల్ల చేనేతన్నకు చేయూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 03:12 AM

టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధికి నిధులు


-నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
-త్రిపుర ప్రాంతం ఆదర్శంగా టెక్స్‌టైల్‌ పార్కులు  
-దక్షిణ భారత టెక్స్‌టైల్‌ మిల్లు ప్రతినిధులు సందర్శన
-పవర్‌లూముల పరిస్థితి సమీక్షకు ప్రత్యేక బృందం
-తమిళనాడులో పర్యటనలు  
-అక్కడి పరిస్థితుల అధ్యయనం
-ప్రభుత్వాలు సహకరించకుండానే తమిళనాడు,
-కరళ చేనేత పరిశ్రమకు జాతీయ స్థారుులో గుర్తింపు
-పారంపల్లి టెక్స్‌టైల్‌ పార్కులో మంత్రి ేకటీఆర్‌

హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి : చేనేత అభి వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల వెన్నుదన్నుగా నిలు స్తుందని రాష్ట్ర పరిశ్రమలు, చేనేత,జౌళి, ఐటి, ము న్సిపల్‌, మైనింగ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరా మారావు అన్నారు. మంత్రి ఆహ్వానం మేరకు సిరి సిల్ల చేనేతకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిరిసిల్లకు వచ్చిన దక్షిణ భారత మిల్లర్ల అసోసియే షన్‌ అధ్యక్షుడు సెంథిల్‌ కుమార్‌, టెక్‌టైల్‌పార్కు పెట్టుబడిదారులతో శనివారం తంగళ్లపల్లి మం డలం పారంపల్లిలోని టెక్స్‌టైల్‌పార్కులో చేనేత అభి వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లా డుతూ, ఎస్‌ఐఎంఏ అధ్యక్షులు జిల్లాలో పవర్‌ లూమ్‌ల పరిస్థితి, వాటితో ఏ రకమైన బట్ట తయార వుతుంది, ఆదునీకరణకు ఎలాటి చర్యలు తీసుకో వాలి అన్న దానిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి సల హాలు, సూచనలు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారని తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరు వూర్‌, ఈరోడ్‌, సెలంలలో పర్యటించి అక్కడి వస్త్ర ప్రదర్వనపై అద్యయనం చేసినట్లు మంత్రి తెలి పారు. అక్కడి వస్త్ర పరిశ్రమకు ఆ  రాస్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా స్వొంతంగా  అంచెలంచెలుగా నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని అన్నారు. రూ.36 వేల కోట్ల వస్త్రోత్పత్తి జరుగుతుందని పల్లడం గ్రామపంచాయితీకి అనుబంధ గ్రామంగా ఉన్న తిరువూర్‌ వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో అనతికాలంలోనే కార్పొరేషన్‌ స్థాయికి చేరుకుందన్నారు. రాస్ట్రంలో 80వేల పవర్‌లూమ్‌లు ఉండగా రూ.13వందలకోట్ల వస్త్రోత్పత్తి మాత్రమే జరుగుతుందని అన్నారు. దేశంలోనే ఉత్తమ నాణ్యతగల కాటన్‌ తెలంగాణా రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుందని, ఏటా 60లక్షల బేళ్ల కాటన్‌ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతం దన్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ ఉత్పత్తి అవుతున్న కాటన్‌ ఇక్కడే వినియోగి ంచాలనే గట్టి పట్టుదలతో ఉన్నారని, ఇందుకు చర్యలు తసీఉకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. త్వరలో పెట్టుబడిదారులతో తమిళనాడులో క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. రాష్ట్రంలో కాటన్‌, నైపుణ్యం గల కార్మికులు, ప్రభుత్వ సహకారం, ఔతా్సి హక పారిశ్రామిక వేత్తలు అన్ని వనరలు అందుబాటులో ఉన్నాయ న్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని వస్త్ర పరి శ్రమను ఆగ్రభాగాన నిలుప ుతా మన్నారు. ప్రభుత్వం చేనేత ఉత్పత్తులకు చేయూత ఇస్తున్నదని ఇందులో భాగంగా ప్రతిసోమవారంనాడు చేనేత వస్తధ్రారణ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. వరంగల్‌లో 1200 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌పార్కు త్వరలో సీఎంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫైబర్‌ నుండి ఫ్యాబ్రిక్‌ వరకు అన్ని ఒకే చోట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
  వరంగల్‌ను సింగిల్‌ స్టాఫ్‌షాప్‌గా అన్ని రకాల ఉత్పత్తుల కేంద్రంగా తయారు చేయనున్నామన్నారు. సిరిసిల్లలో అపెరల్‌పార్కు రాబోయేఉ 6-9నెలల్లో ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో పాల్గొన్న దక్షిణ భారత మిల్లర్ల సంఘం అధ్యక్షుడు సెంథిల్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంఘం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తా మన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారునికి ఏం కావాలో అవగా హనతో ముందుకు సాగాలని వినియోగదారులను ఆకర్షిస్తే, వారే ముందుకు వస్తారని అన్నారు. మంచి కాటన్‌ ఉందని, 33 స్పిన్సింగ్‌ మిల్లులున్నాయని, కాటన్‌ను విడిచిపెట్టిపాలిస్టర్‌ వైపునకు ఎందుకు మెగ్గుచూపుతున్నారన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎస్‌ఐఎంఏ ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ సెల్వరాజ్‌ మాట్లాడుతూ యూనిట్‌లను ఆప్‌గ్రేడ్‌ చేయాలని, స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధికి ప్రణాళిక చేయాలని అన్నారు. జూన్‌ చివరి వారంలో టెక్స్‌టైల్‌ ఇండియా ఆధ్వర్యంలో గంధీనగర్‌లో సదస్సు నిర్వహిస్తారని, దేశ, దేశాల నుంచి ప్రతినిధులు వస్తారని తెలంగాణ ఉత్పత్తులు ఆ సదస్సులో ప్రదర్శించాలని అన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్‌ టెక్స్‌టైల్‌పార్కులోని యూనిట్లను సందర్శించి, వస్త్ర ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సమావేశంలో టెప్కాబ్‌ చైర్మన్‌ కోడూరి రవీందర్‌రావు, కమీషనర్‌ శైలజారామయ్యర్‌, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జేసీ షేక్‌యాస్మిన్‌భాషా, డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్‌, చేనేత సహాయ సంచాలకులు ఆశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa