హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది.ఏప్రిల్ 26న మధ్యాహ్నం 12కు ప్రత్యేక విమానం ద్వారా ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa