హైదరాబాద్ : ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 2 ప్రిలియమ్స్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. 12-30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజాం కాలేజీలో 9-45 గంటలకే గేట్లు మూసివేశారు. కొంచెం ఆలస్యంగా వచ్చినవారు పరీక్షకు అనుమతించాల్సిందిగా కోరారు. అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. లేటుగా వచ్చినవారు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. 9-45 గంటలకు గేట్లు మూసవేస్తామని అధికారులు మందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో క్వాలిఫై అయినవారికి మే నెలలో మెయిన్స్ నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa