ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేనేత కార్మికుల సంక్షేమంపై కేసీఆర్ దృష్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 01:31 PM

హైదరాబాద్: చేనేత కార్మికుల సంక్షేమంపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైంది.నేతన్నల సంఖ్య జీవన స్థితిగతులపై సర్వే చేయిస్తోంది. ఇక చేనేత కార్మికుల సమస్య పరిష్కారానికి కేసీఆర్ ఫార్ములా అయింది. తెలంగాణలో మొదట్నించి నేత కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువే. రాష్ట్రంలో సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట తదితర ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ అధికంగా విస్తరించింది. అగ్గిపెట్టెలో పట్టేంతగా అందమైన చీరలు నేసినా...వారి కుటుంబాలు మాత్రం అంథకారంలోనే ఉన్నాయి. మొక్కుబడిగా ఇచ్చే హామీలతో ఆత్మహత్యలు ఆగడంలేదు. వస్త్రాల తయారీకి ఖర్చు ఎక్కువ కావడంతో అధిక ధరకు అమ్మాల్సి వస్తోంది. రెడీమెడ్ దస్తులు చాలా తక్కువ ధరకే అమ్మడంతో ఎక్కువ ధర ఉన్న చేనేత వస్త్రాలు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.


కొద్దిమంది ఇప్పటికే చేనేత పని వదిలి ఉపాధి కోసం పట్నం బాట పట్టారు. రాను రాను ఈ వృత్తి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతన్నల సమస్యపై అనేక సార్లు స్పందించారు. ఈసారి బడ్జెట్‌లో చేనేతల కోసం రూ.500 నుంచి వెయ్యి కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించబోతున్నారు. రెండుసార్లు ప్రగతి భవన్‌లో చేనేత సంఘాలతో సమావేశమయ్యారు. నేరుగా కార్మికుని చేతికి అందేలా ప్యాకేజీ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ విధానం తర్వాత ప్రతి నేత కార్మికునికి నెలకు రూ.15 నుంచి 20 వేల వరకు కనీస ఆదాయం వచ్చేలా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa