ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని ధ్వజం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 12:50 PM

 హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేసింది వాస్తవం కాదా? నల్లా ద్వారా ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వడం తప్పా? పండుగలు వస్తే పేదలకు మంచి బట్టలిచ్చి అన్నం పెడితే తప్పా? సీఎం కుర్చీ కోసం కోట్లాటే కానీ.. ఎన్నడైనా ఒక్క మంచి పని చేశారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. 


రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్నామని తెలిపారు. అయినా కూడా కాంగ్రెస్ నేతలకు ఇంకా సిగ్గు రాకపాయే అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు సన్నాసుల్లాగానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa