తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో స్వచ్ఛ భారత్ అమలు చేస్తున్న తీరు అద్భుతమన్నారు. అందరం కలిస్తేనే స్వచ్ఛ భారత్ సాధ్యమన్నారు. తెలంగాణలో మరుగుదొడ్ల నిర్మాణం భేష్ అన్నారు. స్వచ్ఛ భారత్, టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించిందని గుర్తు చేశారు. స్వచ్ఛత కార్యక్రమంలో 23 రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు పాల్గొన్నారని వెల్లడించారు. గంగదేవిపల్లిలో ప్రతి ఇంట్లో స్వచ్ఛత పాటిస్తున్నారని వెల్లడించారు. మరుగుదొడ్ల శుభ్రతలో అధికారులు పాల్గొంటే ప్రజలు ఎంతో ప్రభావితులవుతారన్నారు. స్వచ్ఛత, శుభ్రత కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందన్నారు. స్వచ్ఛ భారత్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారన్నారు. స్వచ్ఛతపై అవగాహన కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa