ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14 విభాగాల్లో లాలా ల్యాండ్ ఆస్కార్‌కు నామినేట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:38 PM

హైదరాబాద్: ప్రపంచ సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం హట్టహాసంగా జరగనుంది. లాస్ ఎంజెలెస్‌లో అత్యంత వైభవంగా ఆస్కార్లను ప్రకటించనున్నారు. చిన్న మూవీ.. లాలా ల్యాండ్ ఏకంగా 14 విభాగాల్లో నామినేట్ కావడం రికార్డు. భారతీయ సీనిమాలు కనీసం నామినేట్ కూడా దక్కించుకోలేకపోయాయి. సోమవారం ఉయదానికి ఆస్కార్ అవార్డులు ఎవరిని వరించనున్నాయో తేలిపోనుంది. అభిమానులు ఏడాదిగా ఎదురుచూస్తున్నవేడుక రానే వచ్చింది. సినీ రంగంలో ఎవరెస్టుల్లా భావించే అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి లాస్ ఎంజెలెస్ సిద్ధమైంది. 24 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ఇవ్వనున్నారు. అందుకే 24 విభాగాల్లోనే నామినేషన్లు స్వీకరించారు.


ఆస్కార్ చరిత్రలో ఎక్కువ నామినేషన్లు పొందిన మూడో చిత్రంగా లాలా ల్యాండ్ చరిత్ర సృష్టించింది. 14 విభాగాల్లో ఈ చిత్రం నామినేషన్లు సాధించింది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నేపథ్య సంగీతం వంటి విభాగాల్లో లాలా ల్యాండ్‌కు ఆస్కార్లు వరించే అవకాశం ఉంది. అంతకుముందు 1950లో ఆల్ అబౌట్ ఈవ్. 1997లో టైటానిక్ 14 విభాగాల్లో నామినేషన్లు సాధించాయి. ఇక లాలా ల్యాండ్ విషయానికొస్తే అమెరికాలో లాస్ ఎంజెలెస్‌ను లాలా ల్యాండ్‌గా చెప్పుకుంటారు. అదే పేరుతో దర్శకుడు డామిన్ ఛాజెల్లి రూపొందించిన కథకు సెల్లిలాయిడ్ రూపమే లాలా ల్యాండ్.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa