జొగుళాంబగద్వాల, మేజర్‌న్యూస్. ముఖ్యమంత్రి కేసిఆర్ పై గద్వాల ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై గద్వాల టిఆర్‌ఎస్‌నాయకులు జడ్పి చైర్మెన్ బండారిబాస్కర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపిపి సుభాన్, మాజి మున్సిపల్ చైర్మెన్ బిఎస్ కేశవ్ లు మండి పడ్డారు. ఆదివారం పార్టీ కార్యాలయంలొ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలొ వారు మాట్లాడుతు ముఖ్యమంత్రి కార్యాలయ చెప్రాసిని విమర్శించే అర్హత లేనిదానివి ముఖ్యమంత్రినే విమర్సిస్తావా అని వారు నిలదీశారు. ఆంధ్ర వారి మోచేతినీళ్లు తాగినమీరు ప్రాజెక్టుల నిర్మాణంలొ మీ భర్త అనుచరులు కాంట్రాక్టర్లను బెదిరిస్తే జైలుకువెళ్లిన సంగతి మరిచితివా అన్నారు. ముఖ్యమంత్రిని ఎంత విమర్శిస్తే అంత మార్కులు పడతాయని అన్నారు. అందుకేమాటిమాటికి విమర్శిస్తు టెన్ జన్‌పథ్‌లొ మార్కులు వచ్చేలా వ్యవహరిస్తున్నారని వారు డికెఅరుణను ఘాటుగావిమర్శించారు. స్వంత రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్నికలలొ మీపార్టీని ప్రజలు తిరస్కరించిన సంగతి మరిచారా అని సూచించారు. జలయఙం కాదు ధనయఙంగా మార్చి ఆంధ్ర వారి ప్రాజెక్టుల ప్రారంభొత్సవాలకు టెంకాయలు కొట్టి మీరు పూజలు చేయలేదా అని ప్రశ్నించారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్ త్వరలొ కల్పిస్తారని , షాదిముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు, మజీదులలొ ఇమాంలకు ఆర్థిసహాయమం తదితర పథకాలుచూసి ఓర్వలేక ముఖ్యమంత్రిపై , టిఆర్‌ఎస్ పై కాంగ్రెస్ పార్టీ నిప్పులు పొస్తున్నదని వారు ఆరొపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa