సూపర్ స్టార్ రజినీకాంత్ 164వ చిత్రం కాలా ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆదివారం మొదలైన ఈ చిత్ర షూటింగ్ మరో 40 రోజుల వరకు రెగ్యులర్ గా జరగనుందట. రియాలిటి సీన్స్ అన్నింటిని ముంబై వీధుల్లో తెరకెక్కించనున్న రంజిత్ , ఆ తర్వాత ముఖ్య మైన సీన్స్ చెన్నైలో వేస్తున్న మురికివాడ సెట్ లో చిత్రీకరించనున్నాడు. తాజాగా రంజాన్ ఫెస్టివల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుండగా, రజనీకాంత్ టోపితో కనిపించారు. ముంబై వీధుల్లో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ట్రెండింగ్ గా మారాయి. కాలా ముంబై నేపథ్యంలో సాగే చిత్రం కాగా ఇందులో రజనీకాంత్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుంది. వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.