-ప్రతీ కార్మికునికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తాం
-కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః తెలంగాణలో ఈఎస్‌ఐ సేవల విస్తరణకు కేంద్రం సిద్దంగా ఉందని ఆస్పత్రుల భవన నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోషామహల్‌లో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసినా ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం వల్ల ఆలస్యం జరుగుతుందన్నారు. నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉందని దత్తన్న స్పష్టం చేశారు. కనీసం అద్దె భవనాలు ఇచ్చినా ఆసుపత్రులను ప్రారంభిస్తామని, ప్రతీ కార్మికునికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ అలోక్‌రెడ్డి కుటుంబ సభ్యులను దత్తాత్రేయ తో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పరామర్శించారు. హైదరాబాద్ చైతన్యపురి ఇంద్రానగర్ కాలనీలో అలోక్ తల్లిదండ్రులు ఉంటున్న నివాసానికి వారు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని చెప్పారు. అమెరికాలో ఇటీవల మరణించిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అమెరికాలో ఉంటున్న ప్రతి భారతీయుడికి అన్ని విధాలుగా భరోసా ఇచ్చి ఆదుకుంటామని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. అక్కడి మనవారు కూడా నిపుణులు ఇస్తున్న సలహాలు సూచనలు పాటించాలని, శాంతియుతంగా ఉండాలని, అమెరికాలో భారత రాయబార కార్యాలయం, అక్కడి కాన్సులేట్ అధికారులతో విదేశంగశాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తుందని కేంద్రమంత్రి దత్తన్న తెలిపారు. తన కుమారిడి పరిస్థితి తెలుసుకునేందుకు ఈరోజు అమెరికాకు బయలు దేరుతున్నట్లు అలోక్‌రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa