హైదరాబాద్, సూర్య ప్రధానప్రతినిధిః నేటితరం యువతకు ఘాజీ చిత్రం దేశభక్తిని సరికొత్త రూపం లో పరిచయం చేసిందని కేంద్ర సమాచార, ప్రసా రాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నా రు. రానా, తాప్పీ, కేకే మేనన్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సంకల్‌ప తెరకెక్కించారు. పీవీపీ, మ్యాట్నీ ఎంటర్‌టెన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఘాజీని నిర్మించాయి. ఆదివారం ప్రసాద్ ల్యాబ్‌సలో ప్రత్యేక ప్రదర్శన ద్వారా మంత్రి వెంకయ్యనాయుడు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1971లో జరిగిన ఇండో-పాకిస్థాన్ యుద్ధం గురిం చి చాలా మందికి తెలియని నిజాన్ని తెలియజెప్పిన చిత్రమిది. ప్రజలు తెలుసుకొని గర్వపడాల్సిన చరిత్ర ఇది. కథానాయకుడు రానా మొదలుకొని ప్రతీఒక్కరూ అద్భుత నటనతో సన్నివేశాలను పండించారు. జాతి సమగ్రతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. సబ్‌మెరైన్ గురించి కానీ, అది ఎలా పనిచేస్తుందనే విషయాలను ఆకట్టుకొనే విధంగా చూపించిన దర్శకుడు సంకల్‌పను మెచ్చు కొని తీరాలి. ముఖ్యంగా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఏవీ లేకుండా రూపొందించిన విధానం ప్రశం సనీయం. అవార్డులూ, రివార్డులూ ఆశించకుండా ఒక మంచి సినిమాను నిర్మించినందుకు నిర్మాతలకు కౄఎతజ్ఞతలు అని అన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు. కులం, మతం, వర్గం ప్రాతిపదికన దేశాన్ని అస్థిర పరిచే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని తిప్పికొట్టాలంటే సమైక్యత భావం ఉండాలి. ఈ చిత్రం అదే చెబుతోంది. హోంమంత్రిగా పనిచేసిన చిదంబరం, కశ్మీర్ మన చేతుల్లోంచి వెళ్లిపోయిందని, దేశాన్ని అస్థిర పరిచే మాటలు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ స్పందించలేదు. కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడటం పూర్తిగా బాధ్యతారాహిత్యం. కాంగ్రెస్ హయాంలో రిజర్‌వ బ్యాంకు వ్యవహారాల్లో చిదంబరం తలదూర్చారు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు కూడా స్పష్టం చేశారు. దీనిపై అడిగిన ప్రశ్నలకు ఇప్పటిదాకా సమాధానం లేదు. మోదీ మరో 10ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయం మింగుడుపడకే కాంగ్రెస్ నేతలు ప్రధానిపై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు అని వెంకయ్య విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa