-పరీక్షా కేంద్రం గుర్తించేందుకు మోబైల్ యాప్
-పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు
-అన్ని శాఖలతో సమన్వయం
-మార్చి 1 నుంచి 19 వరకు పరీక్షలు
-రాష్ట్ర వ్యాప్తంగా 1291పరీక్ష కేంద్రాలు
-అన్ని కళాశాలలకు హాల్ టికెట్ల పంపిణీ
-ఫీజుల కోసం `ప్రైవేట్' వేధిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
-ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ కుమార్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 1 నుంచి 19 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1291 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి వస్తువులను అనుమతించమని స్పష్టం చేశారు. ఇప్పటికే హాల్ టికెట్ల పంపిణీ జరిగిందన్నారు.
ప్రైవేటు కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే కళాశాలలపై కంట్రోలర్, బోర్డు సభ్యులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని.. వారి పరీక్షా కేంద్రాన్ని సులువుగా గుర్తించేందుకు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. మొబైల్ యాప్‌లో సదరు విద్యార్థి తన హాల్ టికెట్ నెంబర్ కొడితే.. నేవిగేషన్ మ్యాప్‌తో సహా సెంటర్ బిల్డింగ్.. తాను ఉన్న స్థానం నుంచి అక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందో వంటి విషయాలు తెలుస్తాయన్నారు.
మొబైల్ యాప్‌ను సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభిస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa