హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి ః హైదరాబాద్ లో మరో సారి నిరుద్యోగులు మోసపోయారు. ఉద్యోగ మేళా బోగస్ అని తెలడంతో నిరుద్యో గులు ఆందోళనకు దిగి పర్నిచర్‌ను ధ్వంసం చేశా రు. వివిధ సంస్థల్లో మంచి ఉద్యోగ ఆవకా శాలు.. ఆసక్తి గల వారు ఉప్పల్‌లోని లిటిల్ ప్లవర్ కళా శాల(ఎల్‌ఎఫ్‌జే)కు ఈనెల 26న హాజరు కావాలని గత 15 రోజులుగా వాట్సప్, ఫేస్‌బుక్‌లలో జోరుగా ప్రచారం జరిగింది. ఉద్యోగం కోసం పోటీ పడే అభ్యర్థి రిజిసే్టష్రన్ ఫీజు కోసం రూ. 200 ఆన్‌లైన్‌లో చెల్లించాలని నిర్వాహాకులు సూచించారు. దీంతో నగరంతో పాటు ఇతర జిల్లా లకు చెందిన సుమారు 6 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. వారంతా ఉదయం 8 గంటలకే ఉప్పల్‌లోని లిటిల్ ప్లవర్ కళా శాలకు చేరుకున్నారు. నిర్వాహాకులు ముందుగా ప్రచారం నిర్వహించిన ప్రముఖ కంపెనీలు, సంస్థలు మేళాకు రాలేదని, తప్పుడు ప్రచారం నిర్వహించి తమను మోసం చేశారని వందలాంది మంది యువకులు నిర్వాహ్కులతో వాగ్వాదానికి దిగారు. కొందరు కళాశాలలో ఉన్న పూల కుండీలు, ఫ్న్రిచర్‌ను ధ్వంసం చేశారు. నిర్వాహకులకు దేహాశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న ఏసీపీ సందీప్, ఉప్పల్ పోలీసులు కళాశాలకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa