ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్నాసులు, దద్దమ్మలు అనక మరేమి అనాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:03 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా మొత్తం 35 వేల ఉద్యో గాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.  ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  కాంగ్రెస్‌ నేతలగురించి  ముఖ్యమంత్రి  కేసీఆర్‌ తప్పేమీ మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్‌నేతలను ఒక్కసారి కాదు వందలసారు దొంగలముఠా అంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా  35వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తలసాని అన్నారు. అలాగే గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు  నిరంతర విద్యుత్‌ ఇస్తున్నామని, సాగునీటి  ప్రాజెక్టులు  కడుతున్నామన్నారు. కాంగ్రెస్‌ నాయకులను సన్నాసులు, దద్ద మ్మలు అనక మరేమనాలని ఆయన ప్రశ్నించారు. అలాగే దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తే తప్పేంటని, దీనిపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. టీ-పీసీసీ అధ్యక్షుడు  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్వే తప్పని వాళ్ళ పార్టీ నేతలే చెబు తున్నారని, మార్చి 9 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ నేతలు గట్టిగా కసరత్తు చేసి సమావేశాలకురావాలని సూచించారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa