ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలను పక్కనబెట్టి శతాబ్ది ఉత్సవాలా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:36 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః తెలంగాణ ఏర్పడిన వెంటనే యూనివర్శిటీలను దేవాలయాలుగా అభివృద్ది చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీటీడీపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌... ఆ యూనివర్శిటీ న్యాక్‌ గుర్తింపు కోల్పోయినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూనివర్శిటీలోని సమస్యలను పరిష్కరించకుండా శతాబ్ది ఉత్సవాల పేరుతో ఆడంబరాలకు పోవడం వల్ల విద్యార్థులకు ఒరిగేదిమిటని ప్రశ్నించారు. శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించడానికి ముందే యూనివర్శిటీలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 26నుంచి ఓయూ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. ఈ ఉత్సవాలకు రాష్టప్రతి రాక ఖరారైన నేపథ్యంలో ఆదివారం రేవంత్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో... ఓయూ సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరును తప్పుబట్టారు. ఆంద్రాపాలకుల హయాంలో ఎ-గ్రేడ్‌గా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని, ప్రధానంగా ప్రొఫెసర్లు కూడా యూనివర్శిటీకి కరువయ్యారని ఈ పరిస్థితుల్లో విద్యా ప్రమాణాలు దిగజారి విద్యార్థుల భవిష్య త్తుకు విఘాతం కలిగే పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం పట్టంచుకోవడం లేదని విమర్శించారు. సిబ్బందిని భర్తీ చేయడంతో పాటు కాంట్రాక్‌‌ట, ఔట్‌సోర్సింగ్‌ విధానంతో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించే విషయంలో తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత డిశంబ ర్‌లో టీటీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి పోరు లోనూ ఓయూ సమస్యలపై తాము డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకో లేదన్నారు. ముఖ్యంగా ఏ యూనివర్శిటీకైనా నేషనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు ఉండాలని అప్పుడే కేంద్రం నుంచి ఆ యూనివర్శిటీ అభివృద్దికి ఎక్కువ నిధులు రావడంతోపాటు అక్కడ చదివే విద్యార్థుల డిగ్రీలకు ఎక్కువ విలువ ఉంటుందని తెలిపారు. 2008లో న్యాక్‌ బృందం యూనివర్శిటీని సందర్శించి ఎ-గ్రేడ్‌ యూనివర్శిటీగా గుర్తింపు ఇచ్చిందని, అయితే ఈ గుర్తింపు 2013తో ముగి సిందన్నారు. ఓయూకు న్యాక్‌ గుర్తింపు కోసం చేయాల్సిన ప్రక్రియను ప్రారంభించి ఉంటే ఈ పాటికి ఎప్పుడో న్యాక్‌ గుర్తింపు వచ్చి ఉండేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఓయూకు ఎంతో నష్టం జరిగిందన్నారు. హాస్టళ్లకు మర మ్మత్తులు చేయాలనే విషయాన్ని సైతం పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఓయూలో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందుల గురించి, యూనివర్శిటీకి న్యాక్‌ గుర్తింపు లేని అంశం గురించి  రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa