ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పద్దుపై కసరత్తు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 03:02 AM

చేనేత కార్మికులను ఆదుకునేందుకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు
-నేత కార్మికుల సంక్షేమంపై సీఎం దృష్టి
-ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధం  
-జీవన స్థితిగతులపై సర్వే
-కుటుంబానికి నెలకు రూ. 10-15 వేల ఆదాయం  
-చేనేత కార్మికులపై సమగ్ర సర్వే
చేనేత కార్మికుల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమైంది. నేతన్నల సంఖ్య జీవన -స్థితిగతులపై సర్వే చేయిస్తోంది. ఇక చేనేత కార్మికుల సమస్య పరిష్కారానికి కేసీఆర్‌ ఫార్ములా అయింది. తెలంగాణలో మొదట్నించి నేత కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువే. రాష్ట్రంలో సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట తదితర ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ అధికంగా విస్తరించింది.
హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : అగ్గిపెట్టెలో పట్టేం తగా అందమైన చీరలునేసినా వారి కుటుంబాలు మాత్రం అంథకారంలోనే ఉన్నాయి. మొక్కుబడిగా ఇచ్చేహామీలతో ఆత్మహత్యలు ఆగడంలేదు. వసా్తల్ర తయారీకి ఖర్చు ఎక్కు వకావడంతో అధిక ధరకు అమ్మాల్సి వస్తోంది. రెడీమెడ్‌ దస్తులు చాలా తక్కువ ధరకే అమ్మడంతో ఎక్కువ ధర ఉన్న చేనేత వసా్తల్రు కొనడానికి ఎవరూ ముందుకు రావ డంలేదు. కొద్దిమంది ఇప్పటికే చేనేత పని వదిలి ఉపాధి కోసం పట్నం బాట పట్టారు. రాను రాను ఈ వృత్తి అంత రించిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతన్నల సమస్యపై అనేక సార్లు స్పందించారు. ఈసారి బడ్జెట్‌లో చేనేతలకోసం రూ.500 నుంచి వెయ్యి కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించబోతున్నారు. రెండుసార్లు ప్రగతి భవన్‌లో చేనేత సంఘాలతో సమావే శమయ్యారు. నేరుగా కార్మికుని చేతికి అందేలా ప్యాకేజీ సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ విధానం తర్వాత ప్రతి నేత కార్మికునికి నెలకు రూ. 15 నుంచి 20 వేల వరకు కనీస ఆదాయం వచ్చేలా ఉండాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. జిల్లాల్లో చేనేత కార్మికుల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వ హించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ ఆదే శించారు. చేనేత వృత్తిలో కొనసాగుతున్న కార్మికులు ఏయే గ్రామాల్లో ఉన్నారు. చేతి మగ్గాల  పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించి మార్చి 5లోగా నివేదిక అందించాలన్నారు. ఇటీవల కలెక్టర్లతో వివిధ అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ప్రతీ మగ్గానికి జియో ట్యాగింగ్‌ చేయాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానికి 1000 ఇళ్లను డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకం కింద ప్రతిపాదించామన్నారు. ఈ పథకానికి భూమిని గుర్తించి ఈ నెల 25లోగా నివేదిక ఇవ్వాలన్నారు. ఇందిరా ఆవాస్‌ యోజన పథకం(ఐవైఏ) కింద ఇందిరమ్మ ఇళ్ల బకాయిలను త్వరలో విడుదల చేస్తామన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులన్నీ ఆనలైనలో చేస్తామన్నారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. బీడీ కార్మికులకు గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన సాయంతో పాటు డబుల్‌ బెడ్‌రూ మ్‌ ఇళ్ల వివరాలను కూడా త్వరగా  అందించాలన్నారు. ఇతర రాషా్టల్ల్రో గొర్రెల యూనిట్లకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వివరాలు అందుబాటులో పెట్టాలన్నారు. డిమాండ్‌ సర్వేను ఈనెల 27వ తేదీలోగా సమర్పించి, ఎన్ని గొర్రెలు కావాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కొత్త సొసైటీలను సత్వరం ఏర్పాటు చేయాలన్నారు. సాదా బైనామాల రెగ్యులరైజేషన సత్వరం పూర్తి చేయాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలపై ఆర్డీవోలతో సమీక్షిస్తూ దరఖాస్తుల వెరిఫికేషనను వేగవంతం చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. మిషన భగీరథ పనుల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నారు. బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు చేపట్టాలని, భవనాలను గుర్తించి, నివేదిక అందించాలన్నారు. హరితహారం పథకానికి అవసరమైన నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. గ్రామాల్లో హరిత రక్షణ కమిటీల ద్వారా హరితహారం చేపట్టాలన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa