లాస్‌ఏంజెల్స్: 89వ ఆస్కార్ అవార్డుల సందడి ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీ-ఆస్కార్ పార్టీకి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది వైట్ దుస్తుల్లో ఎర్ర తివాచీపై హొయలు పోయిన ఈ భామ ఈసారి కూడా తనదైన ప్రత్యేక వస్త్రధారణలో కనిపించి మెప్పించింది. ప్రియాంక ప్రీ-ఆస్కార్ పార్టీలో గ్రే, వైట్ కలగలిపిన గౌనులో మెరిసింది. హాలీవుడ్ నటుడు డ్వైన్ జాన్సన్‌తో కలిసి ఆమె ‘బేవాచ్’ చిత్రంలో నటిస్తోంది. ప్రియాంక నటించిన అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రియాంక హాజరు కావడమే కాదు, అవార్డును కూడా ప్రదానం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa