న్యూఢిల్లీ : నోకియా 3310 కొత్త రూపంతో.. సరికొత్త ఫీచర్లతో వచ్చింది. బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆదివారం కొత్త నోకియా 3310ను ఆవిష్కరించారు. 2005లో కనుమరుగైన ఈ మోడల్ హ్యాండ్‌సెట్‌లు అప్పటికే కోట్లాదిగా అమ్ముడయ్యాయి. నోకియా బ్రాండ్ లైసెన్స్ పొందిన ఫిన్‌లాండ్ కంపెనీ హెచ్‌ఎండీ గ్లోబల్ 3310 మోడల్‌కు కొత్త సొబగులు అద్ది ఆవిష్కరించింది. కలర్ డిస్‌ప్లే, 2.4 అంగుళాల స్ర్కీన్, రెండు మైక్రో సిమ్ స్లాట్స్, 2 మెగా పిక్సల్ కెమెరా, 22 గంటల టాక్‌టైమ్, 25 రోజుల స్టాండ్‌బై కొత్త ఫీచర్లు. అప్పట్లో అలరించిన స్నేక్ గేమ్ కూడా ఉంది. ధర సుమారు రూ.3,500.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa