న్యూఢిల్లీ: మహాశివ రాత్రి పండుగ రోజున కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ప్రధాని మోదీ ఓ నిలిరంగు స్కార్ప్‌ను మెడలో ధరించిన సంగతి గుర్తుందా? ఆ నెమలి వర్ణంలో ఉన్న ఆ స్కార్ప్‌ను చూసి శిల్పి తివారీ అనే యువతి ముచ్చటపడ్డారు. అది తనకు పంపించాలని కోరుతూ ఆమె తన ట్విట్టర్ ఖతా నుంచి ట్వీట్ చేశారు. ఒకే ఒక్క లైన్‌లో ట్వీట్ చేసిన ఆ ట్విట్ ప్రధానికి ఎందుకు నచ్చిందో తెలియదుగానీ వెంటనే స్పందించిన ఆయన ఆ స్కార్ప్‌ను ఆమెకు పార్శిల్ ద్వారా పంపారు. ప్రధాని మోదీ స్పందించి తనకు స్కార్ప్ పంపడంతో శిల్పి ఆనందంలో మునిగిపోయారు. వెంటనే ఆ స్కార్ప్ మెడలో వేసుకుని ఫోటో దిగి ట్విట్టర్‌లో పోస్టు చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ట్విట్టర్ ప్రొఫైల్ ఫిక్చర్ కూడా మార్చుకుని మోదీ పంపిన స్కార్ప్ వేసుకున్న ఫోటో పెట్టుకున్నారామె. దీంతో పలువురు ఆమెను అభినందనలతో ముంచెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa