ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెత్త ఆట చిత్తుగా ఓటమి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 01:54 AM

లండన్‌ : చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ పోరులో భారత్‌ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన తుది పోరులో విరాట్‌ సేన చిత్తుగా ఓడింది. అసలు పోరాటమనే విషయాన్నే మరిచిన భారత జట్టు 180 పరుగుల తేడాతో ఓట మి పాలైంది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా వైఫల్యం చెందడంతో భారత జట్టు జీర్ణించు కోలేని పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిం ది. ఒక్క హార్దిక్‌ పాం డ్యా(76; 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేకపోవడంతో భారత్‌కు భారీ ఓటమి ఎదురైంది. హార్దిక్‌ తరువాత శిఖర్‌ ధావన్‌ (21), యువరాజ్‌ (22), రవీంద్ర జడేజా (15)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన మొనగాళ్లు. రోహిత్‌ శర్మ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరగా, విరాట్‌ కోహ్లి (5) మహేంద్రసింగ్‌ ధోని (4), కేదర్‌ జాదవ్‌ (9)లు తీవ్రంగా నిరాశపరిచారు.


ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ పోరులో భారత్‌ జట్టు 30.3 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలింగ్‌. దాంతో వరుసగా రెండో సారి ట్రోఫీ సాధించాలనుకున్న భారత్‌ ఆశ నెరవేరలేదు. మరొకవైపు తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్‌ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ బౌలర్లలో మొహ్మద్‌ అమీర్‌, హసన్‌ అలీ తలో మూడు వికెట్లతో భారత్‌ జట్టు వెన్నువిరవగా, షాదబ్‌ ఖాన్‌కు రెండు, జునైద్‌ ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కింది.


అంతకు ముందు ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్‌ ఓపెనర్లు ఫకార్‌ జమాన్‌ (114;106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్‌ అలీ (59;71 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌)లతో పాటు బాబర్‌ అజమ్‌ (46; 52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్‌ హఫీజ్‌ (57 నాటౌట్‌; 37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరు సాధించేందుకు తోడ్పడ్డారు.


టాస్‌ ఓడడంతో భారత కెప్టెన విరాట్‌ కోహ్లీ నిర్ణయంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు జమాన్‌, అజహర్‌ అలీలు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్‌ అలీ హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆపై జమాన్‌ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకు డుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్‌గా పెవీలియన్‌కు చేరాడు. ఆపై జమాన్‌కు జత కలిసిన ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు బాబర్‌ అజమ్‌ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్‌- జమాన్‌లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్‌ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 200 పరుగు లు చేసింది.


అనంతరం పాకిస్తాన్‌ వెటరన్‌ ఆటగాడు షో యబ్‌ మాలి్‌ (12) భారీ స్కోరు సాధించడంలో నిరాశపరిచినప్పటికీ, బాబర్‌ అజమ్‌ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్‌ సెంచరీకి కొద్ది దూరంలో నాల్గో వికెట్‌గా అజమ్‌ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్‌ హఫీజ్‌ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్‌ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్‌ వసీం (25 నాటౌట్‌; 21 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) తో కలిసి  71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి భారత్‌కు ఊహించిన విధంగా భారీ విజయ లక్ష్యాన్ని అందించింది.


స్కోరు వివరాలు:


పాకిస్తాన్‌ : అజహర్‌ అలీ రనౌట్‌ (ధోనీ/బుమ్రా) 59, ఫఖర్‌ జమాన్‌ సి జడేజీ బి పాండ్యా 114, బాబర్‌ ఆజమ్‌ సి యువరాజ్‌ సింగ్‌ బి కేదార్‌ జాదవ్‌ 46, షోయబ్‌ మాలిక్‌ సి కేదార్‌ జాదవ్‌ బి భువనేశ్వర్‌కుమార్‌ 12, మహ్మద్‌ హఫీజ్‌ నాటౌట్‌ 57, ఇమాద్‌ మసీమ్‌ నాటౌట్‌ 25. అదనం-25. మొత్తం : (నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 338.


బౌలింగ్‌ : భువనేశ్వర్‌కుమార్‌ 10-2-44-1, బుమ్రా 9-0-68-0, ఆర్‌.అశ్విన్‌ 10-0-70-0, హార్దిక్‌ పాండ్యా 10-0-53-1, రవీంద్ర జడేజా 8-0-67-0, కేదార్‌జాదవ్‌ 3-0-27-1.


భారత్‌ : రోహిత్‌శర్మ ఎల్బీడబ్ల్యు బి మహ్మద్‌ ఆమీర్‌ 0, శిఖర్‌ధావన్‌ సి సర్ఫరోజ్‌ అహ్మద్‌ బి మహ్మద్‌ ఆమీర్‌ 21, విరాట్‌ కోహ్లీ సి సహదాబ్‌ ఖాన్‌ బి మహ్మద్‌ ఆమీర్‌ 5, యువరాజ్‌ సింగ్‌ ఎల్బీడబ్ల్యు బి షాదాబ్‌ ఖాన్‌ 22, ధోనీ సి ఇమాద్‌ వసీమ్‌ బి హసన్‌ అలీ 4, కేదార్‌ జాదవ్‌ సి సర్ఫరోజ్‌ అహ్మద్‌ బి షాదాబ్‌ ఖాన్‌ 9, హార్ధిక్‌ పాండ్యా రనౌట్‌ (మహ్మద్‌ హఫీజ్‌/హసన్‌ అలీ) 76, జడేజా సి బాబర్‌ ఆజమ్‌ బి జునైద్‌ ఖాన్‌ 15, ఆర్‌.అశ్విన్‌ సి సర్ఫరోజ్‌ అహ్మద్‌ బి హసన్‌ అలీ 1, భువనేశ్వర్‌కుమార్‌ నాటౌట్‌ 1, బుమ్రా సి సర్ఫరోజ్‌ అహ్మద్‌ బి హసన్‌ అలీ 1. అదనం-3. మొత్తం : (30.3 ఓవర్లలో ఆలౌట్‌) 158.


బౌలింగ్‌ : మహ్మద్‌ ఆమీర్‌ 6-2-16-3, జునైద్‌ ఖాన్‌ 6-1-20-1, మహ్మద్‌ హఫీజ్‌ 1-0-1-0, హసన్‌ అలీ 6.3-1-19-3, షాదాబ్‌ ఖాన్‌ 7-0-60-2, ఇమద్‌ వసీమ్‌ 0.3-0-3-0, ఫఖర్‌ జమాన్‌ 3.3-0-25-0.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com