ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుడితో భక్తుడు సెల్ఫీ.. !

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 10:06 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని అభిమానించే జాబితాలో స్టార్ హీరోలే కాదు.. బడా నిర్మాతలు కూడా ఉన్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బండ్ల గణేశ్‌కి అవకాశం దొరికితే చాలు పవన్‌ని దేవుడితో పోల్చుతూ సంబరపడిపోతుంటారు. తాజాగా కాటమరాయుడు సెట్‌కి వెళ్లిన బండ్ల గణేష్‌ని సాదరంగా ఆహ్వానించిన పవన్.. చివర్లో తనే ఫోన్ తీసుకుని మరీ సెల్ఫీ తీయడంతో గణేష్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడట. ఈ ఫొటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘దేవుడితో భక్తుడు సెల్ఫీ’ అంటూ రాసుకొచ్చారు.
మరో యువ హీరో, పవన్ వీరాభిమాని నితిన్ కూడా కాటమరాయుడు సెట్‌లో సందడి చేశారు. అతను ‘కాటమరాయుడు ఫ్యామిలీతో ’ఓ ఫొటో అంటూ అభిమానులతో పంచుకున్నాడు. కాటమరాయుడు సినిమా నైజాం హక్కులను ఇటీవల నితిన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ రెండోసారి పవన్ కల్యాణ్‌తో ఆడిపాడనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa