ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పౌరుల భాగస్వామ్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 01:35 AM

హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : నగరాలు, పట్ట ణాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో నగరవాసుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాలు, పరిశ్రమలు, ఐటి, చేనేత, జౌళి, విదేశీ వ్యవహారాలు, మైనింగ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అభిప్రాయపడ్డారు. వ్యర్థప దార్థాల నిర్వహణ అనే అంశంపై శనివారంనాడు తాజ్‌ కృష్ణ హోటల్‌లో జరిగిన జాతీయ స్థాయి సదస్సును మంత్రి కె.టి.రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌ శాఖ ప్రభుత్వ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఎమ్మెల్యేలు విన య భాస్కర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమి షనర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డ్డి, మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ టి.కె. శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కేవలం స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలదేననే భావన నగరవాసు ల్లో బలంగా ఉందని, ఈఅభిప్రాయాన్ని దూరంచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నగర పాలయ యంత్రాంగా నికి, పౌరులకు మధ్య భారీ అంతరం ఉందని అభిప్రాయ పడ్డారు. నగర పాలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, న్యూఢిల్లీ లాంటి కొన్ని మున్సిపల్‌ కార్పొరేష న్లలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలను పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములను చేస్తున్నారని, దీని వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని అన్నా రు. హైదరాబాద్‌ నగరంలో కూడా పరిచయ కార్యక్రమం ద్వారా సంబంధిత కాలనీలలో పనిచేసే పారిశుధ్య కార్మి కుల వివరాలు ఆయా గోడలపై ప్రదర్శించడం, పారిశుద్య విధులు నిర్వహించిన కార్మికులు స్థానికులచే సంతకాలు తీసుకోవడం తదితర కార్యక్రమాల వల్ల మరింత చేరువ య్యామని గుర్తుచేశారు. పరిశుభ్రత, వ్యర్థాలను తడి, పొడి చెత్తగా విడదీయడం తదితర అంశాలపై పాఠశాల స్థాయి నుండే విద్యార్థివిద్యార్థులకు చైతన్య కార్యక్రమాల ను నిర్వహించాలని, దీనిలో భాగంగా ప్రతి పాఠశాలలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడానికి చెత్త బుట్టలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తడి, పొడిచెత్త బుట్టలను ఉచితంగా అందించాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలను ఒకొక్క మున్సిపల్‌ అధికారి దత్తత తీసుకోవాలని సూచించారు.


ప్రైవేట్‌ సేకరణపై అధ్యయనం చేయండీ


నగరాలు, పట్టణాల్లో చెత్తసేకరణ ప్రతిరోజు ఒక సవాల్‌గా మారిందని, ఈ చెత్త సేకరణ, నిర్వహణను ప్రైవేట్‌ రంగం ద్వారా చేపట్టడానికి అద్యయనం చేయాలని సూచించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చ సర్వేక్షణ్లో హైదరాబాద్‌ నగరం అగ్రస్థానంలో నిలవడాన్ని ప్రస్తావిస్తూ పురస్కారాలు ప్రధానం కాదని, నిరంతర ఉత్తమ సేవలు అందించడం ద్వారా నగరవాసుల ప్రశంసలు పొందడడం ప్రధానం అన్నారు.  వ్యర్థపదార్థాల నిర్వహణను మరింత వికేంద్రీకరణ చేపట్టడంతోపాటు ఈ ప్రక్రియలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. సాలిడ్‌ వేస్టే మేనేజ్‌మెంట్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విప్లవాత్మక పథకాలైన గ్రేటర్‌ హైదరా బాద్‌లో ఇంటింటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ, 2 వేల స్వచ్ఛ ఆటోటిప్పర్ల ఏర్పాటు, పారిశుధ్య కార్మికులకు దేశంలో మరే కార్పొరేషన్లో లేనివిధంగా వేతనాల పెంపు తదితర చర్యలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని గుర్తుచేశారు. ఈ సదస్సులో మున్సిపల్‌ శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ వ్యర్థపదార్థాల నిర్వహణలో జీహెచ్‌ఎంసీ ఎన్నో విప్లవాత్మక చర్యలు పాటిస్తోందని గుర్తుచేశారు. నగరంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ ఆటోలు, 44 లక్షల డస్ట్‌బిన్‌ల ద్వారా 40శాతం అదనపు చెత్తను సేకరణ పెరిగిందని అన్నారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌ కార్పొరేషన్లో కూడా వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ కార్యక్ర మాలను పాటిస్తున్నారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ కమిష నర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ నగరవాసుల నుండి పలు రకాల మాద్యమాలు, కాల్‌సెంటర్‌, ఫిర్యాదుల విభా గం ద్వారా ప్రతిరోజు 4వేలకు పైగా ఫిర్యాదుల అందుతు న్నాయని, వీటిని పరిష్కరించడంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. నగర పాలన అనేది అత్యంత సవాల్తో కూడుకున్న అంశమని పేర్కొంటూ గ్రేటర్‌ హైదరా బాద్లో దాదాపు 60కిపైగా ఉత్తమ విధానాలు అవలంభిస్తు న్నామని తెలియజేశారు. దేశంలోని ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను తెలు సుకొని తమ నగరంలో పాటించడానికి నేటి సదస్సు ఏర్పా టు చేశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తాగునీటి, పారిశుధ్య విభాగం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వి.రాధ మాట్లాడుతూ నగర పాలనలో స్థానిక ప్రజల భాగ స్వామ్యం అవసరమని, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ ముందంజలో ఉండడం పట్ల అభినందనలు తెలియజేశా రు. సదస్సులో మైజీహెచ్‌ఎంసీ ఐఓఎస్‌ వర్షన్‌ యాప్ను, ఆధునీకరించిన జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ను, వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు, ఈ సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచికను మంత్రి కె.టి.రామారావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆవిష్కరించారు. ఎలైట్స్‌ సహకారంతో ఏర్పా టు చేసిన ఈ సదస్సులో జీహెచ్‌ఎంసీతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com