ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెబ్‌సైట్‌ ద్వారానే కళాకారులకు గుర్తింపు కార్డులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 01:24 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : తెలంగాణ సాంస్కృతీ, సాం ప్రదాయాలను కాపాడేందుకు కళాకారులు కృషిచేయాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్‌ అన్నా రు. శనివారం తెలంగాణ సాంస్కృతిక శాఖ వెబ్‌సైట్‌ను  మంత్రి ఆజ్మీర చందూలాల్‌ సచివాలయంలో ప్రారంభిం చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారు డా.కె.వి. రమణాచారి, ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళాకారులకు గుర్తింపు కార్డులను ఈ వెబ్‌ సైట్‌ ద్వారా జారీ చేస్తారని తె లిపారు. కళాకారులు నేరుగా ఈ వెబ్‌సైట్‌లో తమ వివరా లను నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసు కున్న కళాకారులకు పరి శీలన అనంతరం ఐడి కార్డును వారి మెయిల్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌ ఉన్నట్లయితే పాత ఐడి కార్డు, ఫోటో, 10 వతరగతి సర్టిఫికేట్‌ అప్‌ లోడ్‌  చేయాల్సి ఉంటుందని తెలిపారు. డా.కె.వి. రమణాచారి మాట్లాడుతూ భాషా సాంస్కౄతిక శాఖ కళాకారునిగా గుర్తించి ఐడి కార్డు జారీ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఐడి కార్డు  ఇవ్వడం కళాకారులకు గౌరవ సూచకమని తెలిపారు. కళా కారుల వివరాలన్ని ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయని అన్నారు. వివరాలను పొందుపరిచిన 15 రోజుల లోపల కార్డులను పొందవచ్చని తెలిపారు. కళాకారులకు ప్రభుత్వ ప్రయోజ నాలు అందజేయడం చాలా సులభం అవుతుందని అన్ని వివరాలను ఇందులో అప్‌ డేట్‌ చేయడం జరుగుతుందని అన్నారు. తెలంగాణకు చెందిన కళాకారులందరు ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకొనిలో తమ వివరాలను రిజిష్టర్‌ చేసుకోవాలని ఆయన కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com