శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గౌతమ్ నంద. గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు సంపత్ నంది దర్శకుడు. ఇంతకు మునుపు సినిమాలో కేతరీన్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసిన చిత్ర బృందం నేడు మరో కథానాయిక అయిన హన్సిక పోషిస్తున్న స్పూర్తి పాత్ర లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో హన్సిక అందాలతోపాటు అభినయం తోనూ అలరించనుందట. చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లా డుతూ.. హన్సిక గౌతమ్ నందలో స్పూర్తి అనే పాత్ర పోషిస్తుంది. సాంప్రదాయబద్ధ యువతిగా హన్సిక నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చాలా ఎంటర్ టైనింగ్‌గా ఉంటుంది. ఇటీవల జరిగిన చిత్రీకరణతో గౌతమ్ నంద షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదలైన టీజర్ మరియు మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా గౌతమ్ నంద నిలుస్తుంది. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం అన్నారు.